ఏఓబీపై  పట్టుబిగిస్తున్న గ్రే హౌండ్స్ 

Date:13/10/2018
విజయనగరం ముచ్చట్లు:
ఆంధ్ర, ఒడిషా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య  హోరా హోరీ కాల్పులు జరిగాయి. విశాఖ ఏజెన్సీ బెజ్జంగిలోని పనసపుట్టి సమీపంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందారు. మృతురాలు గాజర్ల రవి భార్య జిలానీ బేగం అలియాస్‌ మీనాగా తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో మీనా పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
ఎన్‌కౌంటర్‌లో మీనా మృతి చెందగా, జయంతి, గీత, రాధిక, రాజశేఖర్ అనే మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలానికి చెందిన మీనా గత 20 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటున్నారు. మీనా మృతి చెందినట్టు వార్తలు రావడంతో ఖానాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో ఉన్న బెజ్జింకి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోలు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ సందర్భంగా మావోలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన బలగాలు కాల్పులు జరపడంతో మీనా ప్రాణాలు కోల్పోయింది.చనిపోయిన మీనాను గాజర్ల రవి అలియాస్ గణేశ్ భార్యగా పోలీసులు గుర్తించారు. ఆమె స్వస్థలం వరంగల్ అని చెప్పారు. కాగా, ఈ ఎన్ కౌంటర్ లో జయంతి, రాధిక, గీత, రాజశేఖర్ అనే మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ మరో నలుగురు మావోయిస్టులు కూడా పట్టుబడినట్టు తెలిపారు.
వారిని జయంతి, రాధిక, గీత, రాజశేఖర్ రాజశేఖర్‌కర్మగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. వీరంతా మావోయిస్టు పార్టీ దళ కమాండర్లుగా భావిస్తున్నారు. కిడారి, సోమ హత్యల తర్వాత ఏఓబీలో మావోయిస్టుల ఏరివేతకు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్ర, ఒడిశాలు ఒక అవగాహనకు వచ్చాయి. వీరిని సజీవంగా పట్టుకోవటంతో, మావోయిస్టులకు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. వీరి నుంచి కిడారి, సోము హత్యకు సంబంధించి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది.
Tags: Gray Hounds that hold on the AOB

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *