24, 25వ తేదీల్లో ”అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం”

Date:22/02/2020

తిరుప‌తి ముచ్చట్లు:

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఫిబ్ర‌వ‌రి 24, 25వ తేదీల్లో అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్టు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య భ‌మిడిపాటి విశ్వ‌నాథ్ శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఫిబ్ర‌వ‌రి 24న సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం నుండి అన్న‌మ‌య్య ఉత్స‌వ విగ్ర‌హం ఊరేగింపు మొద‌ల‌వుతుంది. క‌ళాకారులు సంకీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయ మాడ వీధుల గుండా అన్నమాచార్య కళామందిరానికి తీసుకెళ‌తారు. సాయంత్రం 6 గంటల నుండి మ‌రుస‌టిరోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు 24 గంట‌ల పాటు నిరంతరాయంగా క‌ళాకారులు సంకీర్తనలను ఆలపిస్తారు.

పురుషామృగ వాహనంపై పరమేశ్వరుడి అభయం

Tags: “Great Anniversary of Annamayya Hymns” on the 24th and 25th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *