ప్రిన్స్ ఆగాఖాన్ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు 

Great arrangements for Prince Agah Khan's visit

Great arrangements for Prince Agah Khan's visit

Date:26/02/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
నిజారీ ఇస్మాయిలిజమ్ మతగురువు ప్రిన్స్ ఆగాఖాన్ మూడు రోజుల హైదరాబాద్ పర్యటన కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 27న నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే ఆయన డైమండ్ జూబ్లీ ఉత్సవాల కోసం వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్తో పాటు ఆర్అండ్బీ, మెట్రోవాటర్బోర్డు, రెవిన్యూ పోలీసు శాఖల ఉన్నతాధికారులు నిజాం కళాశాలలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఫిబ్రవరి 26 మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ప్రిన్స్ ఆగా ఖాన్ను ప్రభుత్వం ప్రత్యేక అతిఽథిగా ఆహ్వానం పలుకుతోంది. ఆయన తాజ్ఫలక్నుమా ప్యాలె్సలో బస చేస్తారు. ఫిబ్రవరి 27న ఉదయం రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ను, ఉప ముఖ్యమంత్రి మహ్మమూద్ అలీని మర్యాదపూర్వకంగా కలువనున్నారు. సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో జరిగే డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో పాలొంటారు. 27, 28వ తేదీల్లో నిజాం కళాశాల మైదానంలో జరిగే సభలో ప్రసంగిస్తారు.
Tags: Great arrangements for Prince Agah Khan’s visit

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *