ఉచిత వైద్యశిభిరంకు విశేష స్పందన
చౌడేపల్లె ముచ్చట్లు:
స్థానిక ఉన్నతపాఠశాల ఆవరణంలో మదనపల్లె ఆద్యమల్టీ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కిడ్నీ వై ద్యశిభిరంకు విశేష స్పందన లభించినది. మండలంలోని వివిధ గ్రామాలనుంచి హాజరైన 432 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ సనత్రెడ్డి, డాక్టర్ పావనిరెడ్డిలు తెలిపారు. వీరి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా రోగులకు మందులను పంపిణీ చేశారు. అత్యవసరమైన రోగులకు శస్త్రచికిత్సలకోసం సిపార్సు చేశారు.ఈ కార్యక్రమంలో ఆనందాచార్యులు,శివారెడ్డి,నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Great response to free medical camp

