Great tributes to Mahanetta Rajanna

మహానేత రాజన్నకు ఘన నివాళులు

– దేశచరిత్రలో రాష్ట్రంలో జగన్‌ పాలన సువర్ణయుగం
– అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలుఅందించాం
– రా బోయే రోజుల్లో మరెన్నో పథకాలు

Date:23/05/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కు తంబళ్ళపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఘన నివాళులర్పించారు. శనివారం చౌడేపల్లెలో ఆపార్టీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గోని, వైఎస్సార్‌ కాంస్యవిగ్రహానికి పూల మాల వేసి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలనపై కితాబిచ్చారు. దేశ చరిత్రలో ఆంద్ర రాష్ట్రంలో జగన్‌మోహన్‌రె డ్డి ప్రభుత్వ పాలన సువర్ణయుగమని కొనియాడారు. అర్హత ఉన్న ప్రతి కుటుంభానికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. పేదలను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో మరెన్నో సంక్షేమ పథకాలు అమలకు ప్రభుత్వం స్వీకారంచుట్టిందన్నారు. నివాళుల అనంతరం స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జెడ్పిటీసీ దామోదరరాజు, ఎంపీపీ అభ్యర్థి రామమూర్తి,సింగిల్‌విండో చైర్మన్‌ మునస్వామిరాజు,మిద్దింటి శంకర్‌నారాయణ,మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, నేతలు వెంకటరత్నం నాయుడు, రాజన్న, రమేష్‌,కళ్యాణ్‌భరత్‌, వరుణ్‌, అరుణ్‌, అల్తాఫ్‌, తదితరులున్నారు.

#పెద్దకొండామర్రిలో…..

మండలంలోని పెద్దకొండామర్రిలో మాజీ సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షురాలు జయసుధమ్మ ్యధ్వర్యంలో వైఎస్సార్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీనేత నాగభూషణరెడ్డితోపాటు ఉపాధిహామీ కూలీలు పాల్గొని సంబరాలు చేసుకొన్నారు.

బి.కొత్తకోటలో భారీ జూదం

Tags: Great tributes to Mahanetta Rajanna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *