Natyam ad

గ్రేటర్ కార్పొరేటర్లకు మునుగోడు టెన్షన్

హైదరాబాద్ ముచ్చట్లు:


కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లీడర్స్‌కు మునుగోడు ఫీవర్ పట్టుకుంది. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు తెల్లవారింది మొదలు మునుగోడు బాట పట్టేందుకు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో స్థానిక ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కాంగ్రెస్ నర్సారెడ్డి భూపతి రెడ్డి, కొలన్ హన్మంత్ రెడ్డిలు తమ పార్టీ అభ్యర్థులకు మద్దత్తుగా మునుగోడు నియోజకవర్గంలో నిత్యం హోరేత్తే ప్రచారం సాగిస్తున్నారు. పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతల బిజీలో తలమునకలై ఉదృతంగా విస్తృత పర్యటనలు చేపడుతూ అక్కడి ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు తంటాలు పడుతున్నారు.జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, నిజాంపేట్ కార్పొరేటర్లు, కొంపల్లి, దుండిగల్ కౌన్సిలర్స్ సైతం తమ అధినేతల ఆదేశాలను అనుసరిస్తూ అధికార పార్టీకి అత్యధిక ఓట్లు వేయించేందుకు కంకణం కట్టుకుని శ్రమిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఊర్లలో గల పంచాయతీ వార్డులను, ఒక్కో వార్డుల చొప్పున ఇక్కడి నేతలకు అప్పగించారు. ఒక్కో నేతకు ఒక బాధ్యత అప్పగించి అక్కడ తమ తమ పార్టీల మైలేజ్ రాబట్టాలని ఆయా పార్టీల పెద్దలు స్కెచ్ మ్యాప్‌లు చేతిలో పెట్టి తమ టీంలను రంగంలో దించారు.

 

 

అధినేతల ఆదేశాలను ప్రెస్టేజ్‌గా తీసుకుంటున్న ఇక్కడి నేతలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కొందరు రోజుల తరబడి మకాం వేస్తూ అక్కడ పార్టీ బలాలు, బలహీనతలను ఆయా పార్టీల అధినేతలకు రిపోర్ట్ ఇస్తున్నారు.ఇంకొందరు నేతలు ఉదయం వెళ్లి రాత్రి వరకూ తమ తమ ఎన్నికల వ్యూహాలను రచిస్తూ అర్ధరాత్రి హైదరాబాద్‌లోని తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ నేతలకు ఆయా వార్డుల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరువు బాధ్యతలు అప్పగించడంతో ఏ పోలింగ్ బూత్ లో కూడా ఓట్లు తమ వైపు నుండి జారీ పోకుండా ఉండేందుకు ప్రతి నిత్యం విరామం ఎరుగని శ్రమను మునుగోడుకు దారపోస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, నాయకులు అందరూ మునుగోడు బాట పట్టడం, స్థానిక ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తీరిక లేకపోవడంతో ఇక్కడి స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ఎన్నికలకు ఇక్కడి నేతలు వెళ్లి చేసేదేంటో అంటూ విస్తుపోతున్నారు.

 

Post Midle

Tags: Greater corporators are already tense

Post Midle