కబ్జా చెరువులపై గ్రేటర్  నజర్

Date:16/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
గ్రేటర్ పరిధిలోని కోట్లాది రూపాయాల విలువైన భూములను జిహెచ్‌ఎంసి అధికారులు పరిరక్షించారు. గుట్టల బేగంపేటలోని మేడికుంట, సున్నం చెరువుల్లో కబ్జారాయుళ్లు పథకం ప్రకారం వ్యర్ధాలు వేసి నిర్మించిన పక్కా భవన నిర్మాణాలను తొలగించడానికి చర్యలు చేపట్టారు. మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశాలతో జిహెచ్‌ఎంసి నీటి పారుదల విభాగం ఆధ్వర్యంలో చెరువుల సర్వేను చేపట్టి తొలగించడానికి ఉపక్రమించారు. అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తులు అధికారులపై దాడులకు కూడా పాల్పడటంతో కఠినంగా వ్యవహరించాలని మేయర్ రామ్మోహన్ పోలీసులను కోరారు. పోలీసు భద్రత నడుమ అధికారులను ఆక్రమణలను పూర్తిగా తొలగించి, జెసిబిలతో నిర్మాణాలను కూల్చివేశారు. సున్నం చెరువులోని ఎఫ్‌టిఎల్‌లో కూడా చేపట్టిన అక్రమ నిర్మాణాలను సైతం జిహెచ్‌ఎంసి అధికారులు కూల్చివేస్తుండగా 50 మందికిపైగా ప్రతిఘటించారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. సున్నం చెరువులోని ఆక్రమణలను డిప్యూటి మేయర్ స్థానిక కార్పోరేటర్ సబిహా బేగం స్వయంగా దగ్గరుండి తొలగించడంలో అధికారులు, పోలీసులకు సహకరించారు. 23 ఎకరాల వైశాల్యం ఉన్న ఈ చెరువుల చుట్టూ ఇనుప స్థంబాలు అమర్చి జాలీలు వేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు.
Tags: Greater nozzle on the Kabbaja ponds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *