పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖకు గ్రీన్ అవార్డులు

Green Awards for Panchayati Raj & Rural Development Department

Green Awards for Panchayati Raj & Rural Development Department

-ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్

Date:15/07/2018

అమరావతి ముచ్చట్లు:

మొదటిసారిగా రాష్ట్రస్థాయిలో పచ్చదనం పెంపుదలకు కృషి చేసిన వివిధ సంస్థలకు అవార్డులను ప్రకటించింది.దానిలో దాదాపు 100 సంస్థలు పోటీ పడగా పంచాయరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖకు మొదటి స్థానం లభించింది.￰వారు ఈ అవార్డుల కోసం అనేక ప్రభుత్వ సంస్థల నుంచి నామినేషన్లు స్వీకరించి, దానిపై ఒక ప్రత్యేక జ్యురీ ని వేసి అవార్డులకు ఎంపిక చేశారు.ఈ కమిటీ పచ్చదనం పెంపుదలకు కృషి చేసిన సంస్థల పనితీరును అధ్యయనం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 5.45 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం, 71 వేల ఏకరాల్లో కాఫీ తోటల పెంపకం, 21వేల ఎకరాల్లో బండ్ ప్లాంటేషన్ మొదలైన పనులను చేపట్టిన పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మొదటి స్థానం సాధించింది. ఈ నెల 14-7-2018న కృష్ణ జిల్లా న్యూజీవీడు లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవాల్లో పిఆర్ & ఆర్డీ తరపున సంచాలకులు శ్రీ పి.రంజిత్ బాషా,ఐఏఎస్ వారు స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎపి గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వారు మొదటిసారిగా ప్రకటించిన అవార్డుల్లో 8 అవార్డులు సాధించడం మా శాఖకు గర్వకారణo పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆచరణలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపుదలే లక్ష్యంగా ఈ పనులు చేపట్టడం జరిగింది.ఈ అవార్డు రావడానికి కృషి చేసిన మా సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్ లో రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో పచ్చదనం పెంపుదల జరిగేలా చూస్తామన్నారు.

పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖకు గ్రీన్ అవార్డులుhttps://www.telugumuchatlu.com/green-awards-for-panchayati-raj-rural-development-department/

Tags; Green Awards for Panchayati Raj & Rural Development Department

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *