దేశంలో తొలిసారిగా గ్రీన్‌ ఫంగస్‌ కేసు నమోదు!

న్యూఢిల్లీ ముచ్చట్లు :
దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ నేపద్యం లో  పలు రకాల ఫంగస్‌లూ వెలుగులోకి వచ్చాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్‌ ఫంగస్‌త్‌ పాటు వైట్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా తొలిసారిగా గ్రీన్‌ ఫంగస్‌ వెలుగులోకి వచ్చింది. తొలిసారిగా మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని ఓ వ్యక్తిలో గ్రీన్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపించాయి. అరబిందో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 34 ఏళ్ల వ్యక్తి పరీక్షలు చేయగా.. సైనస్, ఊపిరితిత్తుల్లో ఫంగస్‌ జాడలు కనిపించాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వెంటనే అతన్ని ముంబైలోని ఓ హాస్పిటల్‌కు తరలించినట్లు వైద్యులు తెలిపారు.ఈ ఫంగస్ బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌ కంటే ప్రమాదకరమని పేర్కొంటున్నారు. ఇండోర్‌లోని రూబీ ఆర్చర్డ్‌ రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కొద్ది రోజుల కిందట కరోనా బారినపడి కోలుకున్నాడు. అనంతరం కొవిడ్‌ అనంతర లక్షణాలతో మళ్లీ ఆసుపతిలో చేరాడు. ఈ క్రమంలో మళ్లీ పరీక్షలు చేయగా.. ఊపిరితిత్తులు, సైనస్‌లో ఆస్పెర్‌గిలోసిస్ ఫంగస్‌ను గుర్తించారు. ఉపిరితిత్తుల్లో 90శాతం ఇన్ఫెక్షన్‌ జరిగిందని, ఆ తర్వాత అతన్ని చార్టర్డ్‌ విమానం ద్వారా తరలించగా.. ఇప్పుడు హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి సుమారు ఒకటిన్నర నెలల క్రితం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఊపిరితిత్తుల్లో చీము నిండి ఉందని, దాన్ని తొలగించేందుకు చాలా ప్రయత్నాలు చేసినా విజయవంతం కాలేదని తెలిపారు. చికిత్స సమయంలో, రోగిలో వివిధ రకాల లక్షణాలు గమనించామని, అదే సమయంలో అతనికి జ్వరం 103 డిగ్రీల కంటే దిగువకు చేరలేదని వైద్యులు తెలిపారు. గ్రీన్‌ ఫంగస్‌ ఊపిరితిత్తులకు వేగంగా సోకుతోందని, దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

భర్తను కొట్టి చంపిన భార్య

 

Tags:Green fungus case registered for the first time in the country!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *