పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్‌ ఎన్నికలకు గ్రీన్‌సిగల్‌

Date:12/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన టీఆర్‌ఎస్‌… గ్రామపంచాయతీ ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. వాటితోపాటు మున్సి పల్‌ ఎన్నికలకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడకపోయినా మున్సిపాల్టీ ఎన్నికలపై క్షేత్రస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రంలో 73 మున్సిపాల్టీల్లో పాలక మండ ళ్లు ఉన్నాయి. వాటి గడువు జూలై 3తో ముగియనుంది. ఆలోపు మున్సి పాల్టీలకు ఎన్నికలు నిర్వహించేలా సర్కారు కసరత్తును ప్రారంభించింది. 2018 ఆగస్టు 2న కొత్తగా మరో 73 మున్సిపాల్టీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అవి ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. పాత మున్సిపాల్టీలు, కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాల్టీలు కలిపి గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా 146 మున్సిపాల్టీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు ఆటంకంగా ఉన్న న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతోపాటు కొత్త మున్సిపాల్టీల్లోనూ వార్డుల విభజన ప్రక్రియ ప్రారంభించింది.
వార్డుల విభజనకు ఒక్కొక్క వార్డుకు రెండు వేల మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. మున్సిపాల్టీల్లో విలీనమైన గ్రామాలలోనూ వార్డుల విభజనను చేపట్టింది. జనవరి 10లోపు వార్డుల విభజనను పూర్తి చేయాలని ఆదేశించింది. దాన్ని పరిశీలించిన తర్వాత వార్డు విభజనపై గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందని అధికారిక వర్గాలు అంటున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల విభజనతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నారు. లెక్కల ప్రకారం 40వేల జనాభా నుంచి 60వేల ఉంటే 20 వార్డులు, 80వేల జనాభా ఉంటే 25వార్డులు, లక్ష జనాభా ఉంటే 30వార్డులు, లక్షన్నర జనాభా ఉంటే 36 వార్డులను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం నల్లగొండ మున్సిపాల్టీలో అత్యధికంగా 36 వార్డులు ఉండగా, భువనగిరి మున్సిపాల్టీలో 30 వార్డులు ఉన్నాయి.
Tags:Green Party for municipal elections, including panchayat elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *