పుంగనూరులో దళితులపై పచ్చ చొక్కాల దాష్టీకం- 5 మంది ఆసుపత్రిపాలు

– ప్రభుత్వ స్థలం తమదంటు కత్తులు, కర్రలతో దాడి
– బందోబస్తు ఏర్పాట్లు

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ఖాళీగా కన్పించిన ప్రభుత్వ స్థలాలు దురాక్రమణ చేయడం, అడ్డు వచ్చిన వారిపై కత్తులు, కర్రలతో దాడులు చేయడం పచ్చ చొక్కాలకు అలవాటుగా మారింది. ఇందులో భాగంగా దళితులకు కేటాయించిన ఇంటి స్థలంలో మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మాజీ కౌన్సిలర్లు , వారి కుటుంబ సభ్యులు కత్తులు, కర్రలతో దాడి చేసి, తీవ్రంగా గాయపరచడంతో దళితులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ రాఘవరెడ్డి, ఎస్‌ఐ సుకుమార్‌ లు కలసి ఆప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని కట్టక్రిందపాళ్యెం దళితవాడ ప్రాంతంలో నివాసం ఉన్న దళిత కుటుంభానికి చెందిన చెక్కల రాణేమ్మకు ప్రభుత్వం 2013లో ఇంటి పట్టా మంజూరు చేశారు. అప్పటి నుంచి సదరు స్థలంలో ఆమె ఇల్లుకట్టుకుని ఉన్నారు. ఇలా ఉండగా ఆప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మున్సిపల్‌ అధికారులు స్థలాన్ని పశీలిస్తుండగా అదే ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్‌ పసుపుల కేశవమూర్తి, అతని భార్య మాజీ కౌన్సిలర్‌ అనంతలక్ష్మీ, వారి కుమారులు హరీష్‌, మహేష్‌, ప్రసాద్‌, శ్రీనివాసులు, చైతన్య, బన్ని తదితరులు కత్తులు, కట్టెలతో స్థలం తమదంటు ఒక్కసారిగా రాణెమ్మపై దాడికి దిగబడ్డారు. ఆమె కేకలు వేయడంతో ఆమె కుటుంబ సభ్యులు ఈశ్వరమ్మ, రెడ్డెమ్మ, బాలాజి, సాగర్‌, పవన్‌కుమార్‌, శీరీష, గీత తదితరులు రాణెమ్మను కాపాడేందుకు అడ్డురావడంతో కేశవమూర్తి, వారి కుటుంబ సభ్యులు దళితులను కులంపేరుతో దూషిస్తూ , విచక్షణా రహితంగా కొట్టి వారిని చంపివేసేందుకు తెగబడ్డారు. బట్టలు చించివేసి అవమానించడంతో దళితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. సినిమా తరహాలో పచ్చ చొక్కాల దాడులపై పట్టణ ప్రజలు వణికిపోతున్నారు. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు చికిత్స పొందుతున్నారు. దీనిపై బాధితురాలు రాణెమ్మ ఫిర్యాదు మేరకు సీఐ రాఘవరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సీఐ మాట్లాడుతూ దళితులకు పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేపట్టామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి , దాడులు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

నాడు పోలీసులు…

పట్టణంలోని కట్టక్రిందపాళ్యెంలో ఉన్న తెలుగుదేశం నాయకుడు పసుపుల కేశవమూర్తి ఆగస్టు లో పుంగనూరులో పోలీసులపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉండి , బెయిల్‌పై విడుదలైయ్యాడు. ప్రస్తుతం దళితులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు కావడం గమనార్హం.

Tags: Green shirt attack on Dalits in Punganur – 5 people hospitalised

Post Midle