టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్:

Date:03/06/2020

అమరావతి ముచ్చట్లు:

టీచర్ల బదిలీలకు సీఎం వైఎస్‌ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి సురేష్ తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు బదిలీలు చేపడతామని వివరించారు. బదిలీలు కోసం టీచర్లు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా టీచర్ల బదిలీలు ఉంటాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.  పదవ తరగతి పరీక్షలు పూర్తి అయ్యాక స్కూల్స్ ప్రారంభం అయ్యే లోపు టీచర్ల బదీలీలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు లేరన్న సాకుతో స్కూళ్లు మూసివేయడం లేదని చెప్పారు. గతం ప్రభుత్వం హయాంలో 7 వేలకు పైగా స్కూళ్లు మూసేశారని తెలిపారు. ఒక్క స్కూల్ కూడా మూయడానికి వీల్లేదని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని మంత్రి  ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

పుంగనూరులో మరో కరోనా పేషెంట్‌

Tags: Green signal for teacher transfers:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *