టెన్త్, ఇంటర్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

Date:20/05/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

టెన్త్, ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తున్న కేంద్రం హోం మంత్రి అమిత్ షా తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయంలో విద్యార్థులు,ఇన్వెజిలేటర్లు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఫేస్ మాస్కులు ధరించడం లాంటి నిబంధనలను పాటించాలని కేంద్రం సూచించింది.‘‘లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. బోర్డు పరీక్షలు వాయిదా పడ్డాయి.. బోర్డు పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలు, సీబీఎస్ఈ కోరాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హోం శాఖ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇస్తోంది. పరీక్షలు నిర్వహించేలా లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపు ఇస్తున్నాం’ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రాల సీఎస్‌లకు రాసిన లేఖలో కేంద్రం హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాల పేర్కొన్నారు.కంటైన్మెంట్ జోన్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయొద్దని కేంద్ర హోం శాఖ నిబంధన విధించింది. పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను ఏర్పాటు చేయాలని.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని సూచించింది. విద్యార్థులు ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రాలకు రావడానికి వీలుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయొచ్చని రాష్ట్రాలకు సూచించింది.

ఆయుష్మాన్ భారత్ ద్వారా కోటి మంది ప్రయోజనం: ప్రధాని మోదీ

Tags: Green signal for Tenth and Inter exams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *