Greenhouses are a social responsibility

హరితహారం  సామాజిక బాధ్యత

– రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

Date:26/06/2020

పెద్దపల్లి ముచ్చట్లు:

హరితహారం సామాజిక బాధ్యతగా భావించి ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాలోనాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  పిలుపునిచ్చారు.  శుక్రవారం స్థానిక ఆర్యవైశ్య భవన్ లో   జడ్పీ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించిన  జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. పర్యావరణ సమతుల్యత  కోసం రుపొందించిన  హరితహారం  కార్యక్రమంలో ప్రజలంతా పాల్గోన్ని విజయవంతం చేయాలని  మంత్రి పిలుపునిచ్చారు.   రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటి వరకు 5 విడతలలో సుమారు 182 కోట్ల మొక్కలు నాటామని, మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ సైతం కీలకంగా భావించి నూతన పంచాయతి రాజ్ చట్టాని ప్రభుత్వం రుపొందించిందని  అన్నారు.  6వ విడత కింద గ్రామీణ ప్రాంతాలో 60 లక్షల మొక్కల పెంపకం లక్ష్యంగా నిర్దేశించుకున్నామని,  నాటిన మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని  అన్నారు.

 

 

 

గ్రామీణ ప్రాంతాలో ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేస్తున్నామని, సదరు మొక్కలకు ఇంటిలో నివాసం ఉంటున్న వారి పేర్లు పెట్టి పెంచాలని మంత్రి సూచించారు.   గ్రామాలో అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్  మొక్కల సంరక్షణ బాధ్యత సదరు గ్రామ ప్రభుత్వ సిబ్బందికి  అప్పగించాలని  అన్నారు.  ప్రతి గ్రామంలో  పార్కు  ఏర్పాటు చేస్తున్నామని,  సదరు పార్కులో నాటే మొక్కలను సంపూర్ణంగా సంరక్షించాలని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున   హరితహారంలో పాల్గోనేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల , వర్గాల వారు   హరితహారం  కార్యక్రమంలో పాల్గోనాలని కోరారు.  మార్కెట్ లో  డిమాండ్ ఉన్న పంటసాగు చేయడం ద్వారా  రైతులకు మేలు జరుగుతుందని  సీఎం ప్రవేశపెట్టిన నియంత్రిత సాగు విధానానికి  రైతులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని , మన జిల్లాలో 275829  ఎకరాలో  సాగు ప్రణాళిక రుపొందించుకున్నామని, 192651 ఎకరాలో వరి(55% దొడ్డు, 45%  సన్న) , 81172 ఎకరాలో పత్తి, 1337 ఎకరాలో కందులు, ఇతర పంటలు సాగు చేస్తున్నామని అన్నారు.   కందుల సాగు  పెరిగే దిశగా  రైతులకు అవగాహన కల్పించాలని  ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు మంత్రి సూచించారు.

 

 

 

వానాకాలం పంటకు  రైతుకు  అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచామని,నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారి  పై అత్యంత కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి  తెలిపారు.  *నకీలీ విత్తనాలు విక్రయిస్తున్న వారి సమాచారం  ప్రజాప్రతినిధులు  సంబంధిత అధికారులకు అందించాలని, అదే సమయంలో   రైతులు అధీకృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగొలు చేయాలని,  విత్తనాలు కొనుగొలు చేసిన   రశీదు  ఉంచుకోవాలని, సదరు విషయాల  పై రైతులకు  క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిదులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.    రైతు బంధు  కింద  ప్రస్తుత వానాకాలంలో    కరోనా విపత్కర సమయంలో సైతం  48 గంటలో 54.28 లక్షల  రైతు బ్యాంక్ ఖాతాలో  రూ.6886 కోట్ల నగదు జమ చేసామని,   జూన్ 16 వరకు పాస్ పుస్తకం అందించిన ప్రతి రైతుకు   రైతుబంధు అందిస్తామని మంత్రి తెలిపారు.   నూతనంగా  పాస్ పుస్తకాలు పొందిన రైతులందరు  తమ బ్యాంక్ వివరాలు  వ్యవసాయ విస్తరణ అదికారులకు అందించాలని మంత్రి సూచించారు.

 

 

 

 

దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ  రాష్ట్రం ఆవిర్భవిస్తుందని,   దేశంలో కొనుగొలు చేసిన  ధాన్యంలో 55% తెలంగాణ  పండించిందని అన్నారు.   ధాన్యం కొనుగొలు సమయంలో  ఎదురైన సమస్యలు పునరావృత్తం  కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  జిల్లాలో ధాన్యం దిగుబడి మూడింతలయిందని మంత్రి అన్నారు.  ధాన్యాన్నీ మార్కెట్ యార్డులలో,  రొడ్ల పై ఆరబెట్టుకొని  రైతులు నష్టపోతున్నారని, దీనిని గమనించిన ప్రభుత్వం రైతులకు కళాలు నిర్మించాలని  నిర్ణయించిందని తెలిపారు. ఉపాథి హమి నిధులతో  రైతు పోలాల వద్ద  కళాల నిర్మాణం చేపడుతున్నామని,  రైతులకు దీని పై అవగాహన కల్పించాలని  ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు.

అమరవీరులకు కాంగ్రెస్ సలాం

Tags:Greenhouses are a social responsibility

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *