కాలుష్యాన్ని నివారించేందుకు హరితవనం

Greenhouses to prevent pollution

Greenhouses to prevent pollution

– కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:16/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు పట్టణాన్ని హరితవనంగా మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. సోమవారం పట్టణంలోని గోకుల్‌వీధుల్లో రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి నాయకులు వెంకటరెడ్డి యాదవ్‌, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, అమ్ము, మహిళా సంఘాల సభ్యులతో కలసి  మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణాన్ని హరితవనంగా మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. పట్టణంలోని 24 వార్డుల్లోను ఆయా ప్రాంత ప్రజలను, మహిళా సంఘాలను భాగస్వామ్యులుగా చేసి, పూర్తి స్థాయిలో కానుగ, వేప, నేరుడుతో పాటు ఇండ్ల వద్ద పూలమొక్కలను పెంచే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామన్నారు. పట్టణంలో సుమారు లక్ష మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇండ్ల వద్ద నాటే ప్రతి మొక్కకు ఆ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుని ట్రీగార్డులు ఏర్పాటు చేసి, మొక్కలను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యంగా పట్టణంలో పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ను నిషేధించడం జరిగిందన్నారు. ఇప్పటికే 90 శాతం ప్లాస్టిక్‌ వినియోగాన్ని అదుపు చేశామన్నారు. కొంత మంది రహస్యంగా వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, కేసులు నమోదు చేయడం, జరిమానాలు విధించడం చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా ఆదేశాల మేరకు అక్టోబర్‌ 2 నాటికి ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా పుంగనూరును అందరి సహకారంతో ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్‌మిషన్‌ కో-ఆర్డినేటర్‌ రవి, గౌస్‌, ఆయాజ్‌, శ్రీరాములు , అనిత, హారతి, సుజాత, యామిని తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌పై ప్రచారం….

పట్టణంలోని సంకల్ప సోసైటి సభ్యులు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్‌ నిషేదంపై అవగాహన చేపట్టారు. సంఘ సభ్యులు జానకి, రాజు, సుజాత , ప్రకాష్‌ తదితరులు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జానకి మాట్లాడుతూ గుడ్డబ్యాగులను, పేపర్‌బ్యాగులను వినియోగించాలని సూచించారు. అలాగే ప్లాస్టిక్‌ వస్తువుల ద్వారా జరిగే చెడు గురించి మహిళలకు వివరించారు. పట్టణంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు తాము ఇంటింటికి వెళ్లి చైతన్యం తీసుకొస్తామని జానకి తెలిపారు.

విద్యార్థులను పోటీ పరీక్షలకు ఎంపిక చేయాలి

Tags: Greenhouses to prevent pollution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *