రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకే హరితహారం

Greening the state is good enough

Greening the state is good enough

Date:31/12/2018
మహబూబ్‌నగర్‌ ముచ్చట్లు:
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఏటా కోట్లాది మొక్కలు నాటిస్తూ పచ్చదనం పెంచేలా చర్యలు తీసుకుంటోంది. ఇక మొక్కల కోసం నర్సరీల నిర్వహణకు ప్రాధాన్యమిస్తోంది. పట్టణప్రాంతాల్లోనే కాక గ్రామాల్లోనూ నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. దీంతో పలువురికి ఉపాధి లభించినట్లైంది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో మొక్కల పెంపకం, సంరక్షణ బాధ్యతలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు అప్పగిస్తున్నారు. ఇక గ్రామాల్లో నర్సరీల నిర్వహణ పక్కాగా సాగేలా చర్యలు తీసుకున్నారు. సర్పంచి, గ్రామ కార్యదర్శి ఈ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనేది నిర్ణయిస్తారు. నర్సరీల బాధ్యతలను స్థానిక మహిళా సంఘాల సభ్యులు లేదా ఉపాధిహామీ కూలీలకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరిలో ఎవరు ముందుకు వస్తే వారికే అప్పగించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సంబంధిత అధికారులు గ్రామ నర్సరీల ఏర్పాటుపై దృష్టి పెట్టారు.
ఇప్పటికే గ్రామాలవారీగా పరిస్థితులను పరిశీలించారు. 2019 సంవత్సరానికి సంబంధించిన మొక్కల పెంపకం ప్రక్రియను గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న నర్సరీల్లోనే చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని ఉపాధిహామీ స్కీమ్ ద్వారా చేపడుతున్నారు. మొక్కల పెంపకానికి, నీటి నిర్వహణ, విత్తనాలు, ఇతర పనులకు ఉపాధిహామీ నిధులను వినియోగించనున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 49 నర్సరీలున్నాయి. వచ్చే ఏడాదికి 50 లక్షల మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో అటవీప్రాంతంతోపాటు గ్రామాల్లో 38 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు.
గ్రామాల్లో నాటిన మొక్కలకు ఉపాధిహామీ కూలీలతో నీటిని అందిస్తున్నామని తెలిపారు. ఇక మొక్కల్లో అలంకరణకు వినియోగించేవే కాక పండ్ల మొక్కలను పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే మొక్కలను పెంచుతున్న అధికారులు వివిధ శాఖలకు కూడా ఈ పని అప్పగించారు. అటవీశాఖతోపాటు డ్వామా అధికారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. కార్పోరేషన్ శాఖకు సైతం అదనంగా బాధ్యతలు అప్పగించారు. ఇక ఏ శాఖ మొక్కలు నాటుతుందో ఆ శాఖ అధికారులే వాటి సంరక్షణ బాధ్యతలను సైతం చూడాల్సి ఉంటుంది. మొత్తంగా మొక్కల పెంపకంపై అధికారులు ప్రణాళికబద్ధంగా ముందడుగేస్తున్నారు. మొక్కల పెంపకానికి, జిల్లాలో పచ్చదనం పెంచేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
Tags:Greening the state is good enough

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed