వరుడు లేట్… పక్కింటి అబ్బాయితో పెళ్లి

Date:10/12/2019

లక్నో ముచ్చట్లు:

వధువు ఇంట్లో ఏర్పాటు చేసే పెళ్లికి.. వరుడు ఊరేగింపుగా వెళ్లడం ఆనవాయితీ. అయితే, ఆడ పెళ్లివారు చెప్పిన సమయానికి చేరుకుంటే లోకువ అయిపోతామని.. కొంత మంది మగ పెళ్లివారు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నార్ ప్రాంతంలో కూడా మగ పెళ్లివారు ఇదే చేశారు. పెళ్లి మండపానికి సమయానికి రాకుండా, కావాలని ఆలస్యంగా చేరారు. దీంతో పెళ్లి కూతురు వారికి ఊహించని షాకిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వధువరులిద్దరూ ఆరు వారాల కిందటే సామూహిక వివాహాల్లో పాల్గొని పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆ పెళ్లి వారి కుటుంబికులకు సంతృప్తి ఇవ్వలేదు. లాంఛనాలతో సాగితేనే అసలైన మజా అనుకుని రెండోసారి తమ సంప్రదాయాల ప్రకారం వారిద్దరికీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు.రెండు రోజుల క్రితం ముహూర్తం నిర్ణయించారు. వరుడు భరాత్ మధ్యాహ్నం 2 గంటల కల్లా పెళ్లి మండపానికి చేరాలని వధువు బంధువులు తెలిపారు. అయితే, వరుడు మాత్రం తాపీగా ఊరేగుతూ చీకటి పడిన తర్వాత పెళ్లి మండపానికి చేరుకున్నాడు. అప్పటికే కోపంతో ఉన్న వధువు.. తన పొరుగింటి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆమె నిర్ణయానికి కుటుంబ సభ్యులు కూడా వంత పాడారు.ఆలస్యంగా పెళ్లి మండపానికి చేరుకున్న వరుడికి ఈ విషయం తెలియగానే షాకయ్యాడు. దీంతో వారంతా పోలీసు స్టేషన్‌కు వెళ్లి వధువు కుటుంబికులపై ఫిర్యాదు చేశారు. పెళ్లి మండపానికి చేరుకున్న తమని ఒక గదిలోకి తీసుకెళ్లి కొట్టారని, వధువు కోసం కొనుగోలు చేసిన ఆభరణాలు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఫిర్యాదు చేశారు. అయితే, వధువు కుటుంబికులు మాత్రం వేరే వాదన వినిపించారు. సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకున్న తర్వాత వరుడి కుటుంబికులు తమను వరకట్నం కోసం వేధించారని, స్కూటర్‌ కూడా పెట్టాలని అడిగారన్నారు. పైగా, పెళ్లికి సమయానికి రాకుండా తమని ఇబ్బంది పెట్టారని తెలిపారు. మరి, ఈ కేసు ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.

 

నేటి రాశి ఫలాలు

 

Tags:Groom Late … Married with next door boy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *