కర్నూలులో వరుడు దుర్మరణం

Date:6/08/2020

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఆదోనిలో యువకుడు కరోనా సోకి చికిత్స పొందుతూ చనిపోయాడు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడులు ఇలా చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. ఆదోనిలోని 11వ వార్డుకు చెందిన యువకుడు గతనెల 28న తీవ్ర జ్వరంతో బాధపడ్డాడు. కరోనా అనుమానంతో వెంటనే స్థానికంగా ఉండే ఏఎన్‌ఎంను సంప్రదించాడు. ఆ తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించారు.. ఇంతలోనే యువకుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.యువకుడు హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  చనిపోయవాడు. అతడికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది.. బుధవారం పెళ్లిచేయాలని పెద్దలు నిశ్చయించారు.. కరోనా కాటుకు బలయ్యాడు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఇలా అర్ధాంతరంగా చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడికి తల్లిదండ్రులు, చెల్లెలు ఉన్నారు. తల్లి పక్షవాతంతో మంచాన పడగా.. తండ్రి వయసు మీద పడి ఇంటికే పరిమితమయ్యారు. కుమారుడిని కోల్పోయి ఆ తల్లిదండ్రులు దిక్కులేనివారయ్యారు.

ఆర్మూర్ లో అడ్డూ, అదుపు లేని పేలుళ్లు. 

Tags:Groom murdered in Kurnool

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *