కాషాయం జోలికొస్తే…. ఖబడ్దార్-సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్..

-నిరుద్యోగులారా…. తస్మాత్ జాగ్రత్త.
-అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మరోసారి మోసం చేయబోతున్నడు.
-లక్షా 91 వేల ఉద్యోగాలిచ్చేదాకా వదలిపెట్టే ప్రసక్తే లేదు.
-బకాయిలతోసహా నిరుద్యోగ భ్రుతి ఇవ్వాల్సిందేనని డిమాండ్.
హైదరాబాద్  ముచ్చట్లు:
‘‘ఖబడ్డార్ కేసీఆర్ … హిందూ ధర్మాన్ని కించపరిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ సంగతి చూస్తం. అసలు నువ్వెంత ? నీ పార్టీ బలమెంత? కాషాయ జెండా అంటేనే ధర్మం కోసం నిలబడి కలబడే జెండా… న్యాయం కోసం పరితపించే జెండా’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.  మా గురువుగారికి (కేసీఆర్ ను ఉద్దేశించి..) కాషాయపు జెండా సెగ తగిలింది. కాషాయపు జెండాను నమ్ముకున్నోడికి ఆసరా ఇస్తుంది. ప్రాణమిస్తోంది. ద్రోహం చేసినోన్ని అథ:పాతాళానికి తొక్కేస్తుందని మా గురువు గారికి అర్ధమైంది.నిన్నటి  5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ కాషాయ జెండా ఎగరేయబోతుందని తెలిసి కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టింది. దేశమంతా తిరుగుతా… ఏదో ఉద్దరిస్తానని మొన్నటి దాకా బడాయి మాటలు చెప్పిండు. 10వ తేదీనాడు భారత రాజకీయాలను మలుపు తిప్పే రిజల్ట్స్ రాబోతున్నయ్. అందుకే దీన్ని డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ మరో జిమ్మిక్కు చేయబోతుండు. 8 ఏళ్ల నుండి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటుండు. రేపు నువ్వేం ప్రకటిస్తవో… ప్రకటించు.. కానీ అంతకు ముందే ప్రతి నిరుద్యోగ తమ్ముడు, చెల్లికి 1 లక్షా 20 వేల నిరుద్యోగ భ్రుతి బకాయి చెల్లించి ఏదైనా మాట్లాడు.మళ్లో డ్రామా తీసుకొచ్చినావ్…. నిన్నటి బడ్జెట్ లో ఎందుకు పెట్టలే. ఒక ప్రకటన చేసి వదిలేస్తే ఇగ మళ్లీ మాయలో పడిపోతారనుకుంటున్నవ్? నీ జేజెమ్మను కూడా వదలం…2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందే. పదివేలో, 20 వేలో ప్రకటించి చేతులు దులుపుకుంటానంటే ఊకునేది లేదు. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇయ్యాల్సిందే.. అదేదో గొప్పగ చెబుతున్నవ్? నీ ఇంట్లకెళ్లి ఇస్తున్నవా? ఈ 8 ఏళ్లలో ఎంతమంది నిరుద్యోగులను బలి తీసుకున్నవ్? తుగ్లక్ ముఖ్యమంత్రిగారు జర జాగ్రత్తగా మాట్లాడు. కాషాయ జెండాను, బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతవా? నీకా దమ్ముందా? దేశంలో పచ్చ జెండా ఎంఐఎం ఎజెండాను విస్తరింపజేయడానికి ప్రణాళిక చేస్తున్నవా? నీలాంటి కొన్ని వందల మంది బీజేపీని కనుమరుగు చేద్దామని రహస్య ఎజెండాను అమలు చేసి తీరా ఏమీ చేయలేక కనుమరుగైపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడున్నది? కమ్యూనిస్టులు ఎక్కడున్నరు?
నువ్వెంత ? నీ బతుకెంత? నీ పార్టీ ఎంత? నీ పార్టీ బలమెంత? మంది దగ్గర గెల్చినోళ్లను తెచ్చుకుని బలమని మురిసిపోతున్నవ్.  అది బలం కాదు… వాపు మాత్రమే. కాషాయ జెండా అంటేనే ధర్మం కోసం నిలబడే జెండా… న్యాయం కోసం పరితపించే జెండా.. ఇది త్యాగాల జెండా… త్యాగాల పునాదుల మీద కాషాయ జెండా రెపరెపలాడుతూనే ఉంటది.
నువ్వో పెద్ద చరిత్ర కారుడవు కదా… కాషాయ జెండా యాడ పుట్టిందో తెలుసా? మహాభారతంలో పాండవులకు, కౌరవులకు యుద్దం జరిగినప్పుడు క్రుష్ణుడు పట్టుకున్న జెండా కాషాయ జెండా… ధర్మం కోసం క్రుష్ణుడు పట్టుకున్న కాషాయ జెండా.. కౌరవులను ఓడించిన జెండా.. మమ్ముల్ని బంగాళా ఖాతంలో కలుపుతానంటవా? నీ తరం కాదు.. నీ అబ్బ తరం కాదు. మేం గోల్ మాల్ గోవిందలమా?…… ప్రపంచ గోల్ మాల్ గోవిందాలకు అధ్యక్షుడివి నువ్వే… గోల్డ్ మెడల్ నీదే.. అబద్దాలాడేటోళ్లకు ఆస్కార్ ఇవ్వాల్సి వస్తే తకుమించి పురస్కార్ నీకే ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమం తరువాత అధికారం చేపట్టినప్పటి నుండి అడుగడుగునా గోల్ మాల్ చేసినవ్. తెలంగాణ ఉద్యమ కారులను మోసం చేసినవ్? నిరుద్యోగులను రోడ్డు పాల్జేసినవ్… రైతులను మోసం చేసినవ్… చివరకు ఉద్యోగులను కుటుంబాలకు దూరం చేసి తమాషా చూస్తున్నవ్? తెలంగాణను బంగారు తెలంగాణను చేసిండట… దేశాన్ని బంగారు భారత్ చేస్తడట… చెప్పడానికైనా నీకు కొంచెమైనా సిగ్గన్పించడం లేదా? నువ్వు పీకేందేమిటి? ఏనాడైనా ఆత్మ పరిశీలన చేసుకున్నవా? ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పరిధి రాష్ట్రాలదేనని చెప్పి చాలా ఏళ్లుగా అనేక తీర్పులు, చట్టాలు చెబుతున్నా…. నువ్వు మాత్రం ఓ కాగితం పడేసి ఎస్టీ రిజర్వేషన్లు కేంద్రం ఇవ్వడం లేదని మాపై నింద వేస్తున్నవ్?
అసెంబ్లీలో తీర్మానం చేస్తే మమ అన్పించుకోవడం నీకలవాటే. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాల్మీకి బోయలను ఏనాడో న్యాయం జరిగేది. ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతానికి పెరిగేవి.• కానీ ఇవేవీ నువ్వు చేయవ్… బీజేపీ మీద నింద వేయడానికి రడీగా ఉంటావ్… థూ.. నీ బతుకు చెడ. మమ్మల్ని మతపిచ్చి గాళ్లంటవా? ఎస్.. మేం హిందూ ధర్మం కోసం ప్రాణమిచ్చేంత మతపిచ్చిగాళ్లమే. నువ్వు ఓట్ల కోసం హిందూ వేషం వేస్తవ్? సీఎం సీటు కోసం మంత్రాలు, తంత్రాలు చేస్తవ్. నీ ఫాంహౌజ్ లో క్షుద్ర పూజలు చేస్తవ్. మళ్లా రజకార్లను తలమీద పెట్టుకుని ఊరేగుతవ్? మరి రజాకార్లు ఎవరు? మతపిచ్చి గాళ్లు కాదా… హిందూ ధర్మానికి అడ్డమొస్తే ఎంతటి వాళ్లనైనా చూస్తూ ఊరుకునేది లేదు. ఎంతదాకైనా పోతాం. ఖబడ్డార్… కేసీఆర్ … రాజకీయాలు మాట్లాడితే వదిలేస్తమోమో… కానీ హిందూ ధర్మాన్ని కించపరిస్తే  నీ సంగతి చూస్తం. ఇప్పటికే కరీంనగర్ గడ్డమీద ‘హిందూగాళ్లు.. బొందగాళ్లు’ అంటే ఏమైందో నీకు తెలుసు…గిట్లనే తీట మాటలు మాట్లాడితే తాట తీస్తం బిడ్డా.. కేసీఆర్ నువ్వెన్ని వేషాలు వేసినా…. ఇంకెన్ని డ్రామాలు  చేసినా…. చివరకు మిగిలేది.. పీకే లు.. బోకేలే. జనం నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు రాబోతున్నయ్?.. నువ్వు, నీ కొడుకు తట్టా బుట్టా సర్దుకుని దేశం విడిచిపోయే రోజులు రాబోతున్నయని అన్నారు.
 
Tags:Group-1 Jobs within Local Reservations-Chief KCR

Leave A Reply

Your email address will not be published.