ప్రశాంత వాతావరణంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష
తిరుపతి ముచ్చట్లు:
ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశాంత వాతావరణంలో జరిగిందని జిల్లా కలెక్టర్ కె .వెంకటరమణ రెడ్డి తెలిపారు. తిరుపతి కేంద్రంగా 14 పరీక్షా కేంద్రాలలో రెండు సెషన్స్ లో జరిగిన ఈపరీక్షలకు 7915 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా ఉదయం సెషన్ లో 5522 మంది 69.77 శాతం మధ్యాహ్నం సెషన్ లో 5510 మంది 69.61 శాతంగా అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో తమ వంతు బాధ్యతగా పరీక్షల కోఆర్డినేటర్ గా వ్యవహరించిన రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, కస్టోడియన్ గా వ్యవహరించిన ఆర్డిఓ కనక నరసారెడ్డి, లైజన్ అధికారులుగా విధులు నిర్వహించిన జిల్లా అధికారులను , ఏపీపీఎస్సీ అధికారుల ను , పోలీస్ శాఖ వారిని, సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందించారు.

Tags: Group 1 Prelims Exam in calm environment
