భవిష్యత్ భారత పౌరులుగా ఎదగండి- విద్యార్థులకు టీటీడీ ఈవో పిలుపు

-టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా
-ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీ

– ఆక‌ట్టుకున్న 75 మంది స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల వీడియో

 

తిరుప‌తి ముచ్చట్లు:

స్వాతంత్య్ర భారతావని 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను నిర్వహించాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగులు , విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు . టీటీడీ పరిపాలన భవనం నుండి మహతి ఆడిటోరియం వ‌ర‌కు ర్యాలీ సాగింది.మహతి క‌ళాక్షేత్రంలో 75 మంది స్వాతంత్య్ర‌ సమరయోధుల జీవిత చ‌రిత్ర‌ల‌తో కూడిన 42 నిమిషాల ఆడియో-వీడియో ప్రదర్శించారు. దీనికి టీటీడీ విద్యా సంస్థల ఉద్యోగులు మరియు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది.అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఈవో మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో టీటీడీ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు తమ కెరీర్‌ను ఇతరుల కంటే ఉన్న‌తంగా రూపొందించుకోవాల‌న్నారు. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణ, అంకితభావంతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడం ప్రతి విద్యార్థి బాధ్యత అన్నారు.”ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” ఉత్సవాలకు తగిన విధంగా రెండు రోజుల్లో ఆకర్షణీయంగా వీడియోను సిద్ధం చేసినందుకు సిఏవో శ్రీ శేష శైలేంద్ర , ఎస్వీబిసి సిఈవో శ్రీ షణ్ముఖ‌ కుమార్‌లను ఈవో సన్మానించారు.

 

 

ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు జెఈవోలు   సదా భార్గవి,   వీరబ్రహ్మం, సివిఎస్వో  నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఎవో   బాలాజీ, డిఈవో   గోవిందరాజన్‌లను ఈవో ఘనంగా సత్కరించారు.అంతకుముందు విద్యార్థులు వివిధ స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో తిరుపతి వీధుల్లో వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తితో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీఈ  నాగేశ్వరరావు, ఐటీ జీఎం శేషారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు, డెప్యూటీ ఈవోలు, టీటీడీ విద్యాసంస్థలలోని వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: Grow as future citizens of India- TTD evo calls to students

Leave A Reply

Your email address will not be published.