పెరుగుతన్న మాల్స్ కల్చర్

Growing Malls Culture

Growing Malls Culture

Date:06/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
పెరుగుతున్న నగరాల అభివృద్దితో పాటు ప్రజల అభిరుచుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. షాపింగ్ కి వెళ్లాలనుకుంటే మాత్రం మాల్స్ కి వెళ్లడానికే జనం ఆసక్తి చూపుతున్నారు. అన్ని వస్తువులు ఒకే చోట దొరకడంతో పాటు ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉండటంతో మాల్స్ కి క్యూ కడుతున్నారు.
సిటీజనంలో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు షాపింగ్ అంటే అమీర్ పేట్, కోఠికో వెళ్లి అన్ని షాప్స్ తిరిగి నచ్చింది కొనుక్కొని వచ్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.
ఏది కావాలన్నా షాపింగ్ మాల్స్ కి వెళ్తున్నారు.  మాల్ లో కావాల్సినవన్నీ దొరుకుతుండటంతో అంతా అక్కడికే వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.షాపింగ్ కి వచ్చేవారికి ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడానికి మాల్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ పరిచయం చేస్తున్నాయి.. షాపింగ్ చేసిన ప్లేస్ లోనే మాల్స్ లో మూవీ స్క్రీన్స్ కూడా ఉంటున్నాయి. వీటితో పాటు ఫుడ్ కోసం ప్రత్యేకంగా ఫ్లోర్ మొత్తం రెస్టారెంట్స్ కి కేటాయిస్తున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ స్పోర్ట్స్ స్టేషన్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి.
మాల్స్ కి వెళ్లేవారి సంఖ్య రోజురోజుకీ పెరగడంతో సిటీతో పాటు నగర శివార్లలో కొత్త కొత్త మాల్స్ పుట్టుకొస్తున్నాయి. మెట్రోరైలు వచ్చిన తర్వాత మెట్రో మాల్స్ కూడా అందుబాటలోకి వచ్చాయి. ఇప్పటికే పంజాగుట్ట, హైటెక్ సిటీలో మెట్రో మాల్స్ ఓపెన్ అయ్యాయి. మెట్రో పూర్తయితే మరో ఆరు మాల్స్ ఓపెన్ అవుతాయి.మాల్స్ కి షాపింగ్ వచ్చేవారి కోసం అన్నిరకాల నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అందుబాటులో ఉంచుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.
ఫుడ్ రెస్టారెంట్స్ పై జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అందుకే అన్నిరకాల రెస్టారెంట్లను మాల్స్ లో అందుబాటులో ఉంచుతున్నామంటున్నారు. పిల్లల కోసం ఎంటర్ టైన్ మెంట్ కాన్సెప్ట్స్ కూడా  ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఒకే చోట అన్ని దొరుకుంతుండటంతో మాల్స్ కి వెళ్లడానికే ఇష్టపడుతామంటున్నారు జనం.
ఫ్యామిలీతో బయటకొస్తే షాపింగ్ ఒకచోట, రెస్టారెంట్ మరోచోట కాకుండా… అన్నీ మాల్స్ లోనే ఉండటంతో ఇక్కడికే వస్తున్నామని చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వస్తే షాపింగ్, సినిమాతో ఎంజాయ్ చేసి వెళ్లొచ్చంటున్నారు. గ్లోబల్ సిటీస్ గా మారుతున్న హైదరాబాద్ లో త్వరలో మరిన్ని మాల్స్ వచ్చే అవకాశాలున్నాయి.
Tags:Growing Malls Culture

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *