గులాబీలో పెరుగుతున్న ఆశావహులు

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ ఏర్పాటు తర్వాత టిఆర్ఎస్ రెండుసార్లు అధికారాన్ని చేజిక్కుంచుకొంది. మూడవసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐ ప్యాక్‌తో గులాబీపార్టీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఆ సంస్థ పలు నివేదికలను టీఆర్ఎస్ పెద్దలకు అందచేస్తోంది. సీఎం కేసీఆర్‌తో పీకే సమావేశమై అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న రాజకీయ పరిస్థితిని వివరించారట. ఆ విషయాలను వడపోసిన తర్వాత టీఆర్ఎస్‌ వేగంగా చర్యలు మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది.ఇన్నాళ్లూ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం అన్నది టీఆర్ఎస్‌ మాట. ఇంకా చెప్పాలంటే జిల్లా మంత్రి కూడా ఎమ్మెల్యే అనుమతి లేకుండా అసెంబ్లీ నియోజకవర్గాలలో జోక్యం చేసుకోవడానికి ఉండదు. పార్టీ వైపునుంచి జిల్లాలకు సీనియర్ నాయకులు ఇంచార్జ్‌లుగా ఉంటారు. అయితే పీకే నివేదికలపై సమీక్షల తర్వాత ఈ పరిస్థితి మారబోతుందన్న చర్చ గులాబీ శిబిరంలో జరుగుతోంది.అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి ఇద్దరు ఇంఛార్జ్‌లను నియమించే ఛాన్స్ ఉన్నట్టు టాక్. పక్క జిల్లాలకు చెందిన నేతలకు ఇంఛార్జులుగా బాధ్యతలు అప్పగిస్తారట. ఈ ఇంచార్జిలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం హైకమాండ్ నుంచి వచ్చే సలహాలు, సూచనలు సెగ్మెంట్‌లో అమలు చేస్తారట. ఇప్పటి వరకు ఎమ్మెల్యే నుంచి వచ్చే సమాచారంపైనే పార్టీ ఆధారపడుతూ వచ్చింది. కానీ ఇద్దరు ఇంఛార్జులు వస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని లెక్కలేస్తున్నారట.ఈ ఇద్దరు ఇంఛార్జుల కాన్సెప్ట్‌ తెలిసినప్పటి నుంచి పీకే బృందం ఇచ్చిన నివేదికలో ఏముంది అనే ఆసక్తి పెరుగుతోంది. ఎన్నడూ లేనిది ఎమ్మెల్యేను కాకుండా మరో ఇద్దరు నేతలను ఇంఛార్జులుగా పెట్టడంపై ఎవరి స్థాయిలో వారు ఆరా తీస్తున్నారట. ఈ ఇంఛార్జులు సిట్టింగ్‌లకు ఎసరు పెడతారో లేక పార్టీ బలోపేతానికే నిజంగా చర్యలు తీసుకుంటారో అనే అనుమానాలు ఉన్నాయట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలలో ఒక్కటే ఆందోళన. పీకే నివేదికలు తమ సీటుకు ఎక్కడ ఎర్త్‌ పెడతాయోనని టెన్షన్‌ పడుతున్నారట. మరి.. ఈ ఇద్దరు ఇంఛార్జుల కాన్సెప్ట్‌ అధికార పార్టీకి ఏ మేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

 

Post Midle

Tags: Growing optimists in pink

Post Midle
Natyam ad