Growing prices of mango and tomato growers

మామిడి , టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

– జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు జనార్ధన్‌

Date:14/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లాలోని మామిడి, టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు జనార్ధన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన పుంగనూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం జనవరి 15న రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 22 పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తూ జాబితా విడుదల చేశారని తెలిపారు. ఆజాబితాలో చిత్తూరు జిల్లాకు చెందిన పంటలు ఒక్కటి కూడ లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఎన్నికల సమయంలో హామి ఇచ్చిన మేరకు చిత్తూరు జిల్లా రైతులకు ఎలాంటి లాభము చేకూరలేదన్నారు. జిల్లా రైతులకు ఎలాంటి లాభము చేకూరలేదన్నారు. ముఖ్యంగా మామిడి బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు హాంద్రీనీవా సమాంతర కాలువలను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో 2.50 లక్షల ఎకరాలలో మామిడి పంట, 50 వేల ఎకరాలలో టమోటా, 40 వేల ఎకరాలలో మల్భరీ పంటలు పండిస్తున్నారని తెలిపారు. కానీ రైతులకు ఎలాంటి గిట్టుబాటు ధరలు కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై మార్చిలోపు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం అప్పటికి స్పందించకపోతే ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నేతలు రామ్మూర్తి, ప్రసాద్‌, మున్సిపల్‌ కార్మిక సంఘ నాయకుడు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

 

దక్షిణకాశిగా విరాజిల్లుతున్న శ్రీఅగస్తీశ్వరస్వామి ఆలయం

Tags: Growing prices of mango and tomato growers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *