రిషి సునాక్ కు పెరుగుతున్న మద్దతు

లండన్ ముచ్చట్లు:


రాజీనామా చేసిన బోరిస్‌ జాన్సన్‌ స్థానంలో కొత్త ప్రధాని ఎవరనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఈ పదవికి అధికార కన్జర్వేటివ్‌ పార్టీలో 11 మంది పోటీ పడ్డా, ఇప్పటి వరకు బరిలో రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌ మాత్రమే మిగిలారు. ఆ పార్టీ సభ్యులంతా ఓటింగ్‌ ద్వారా ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంది. దాదాపు లక్షా 60 వేల మంది ఓటు వేయాల్సి ఉంది. అయితే సైబర్‌ హ్యాకర్ల భయంతో ఎలక్ట్రానిక్ మెయిల్‌ కాకుండా పోస్టల్‌ బ్యాలట్‌ను ఎంచుకున్నారు. అందరి ఓట్లు ఆగస్టు 11 నాటికి చేరుకున్నాక కౌంటింగ్‌ నిర్వహిస్తారు. భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్‌ ప్రధాని పదవి రేసులో ముందున్నా ఆయన స్పీడుకు కన్జర్వేటివ్‌ సభ్యులు బ్రేక్‌ వేశారు. ఎంపీల్లో చాలా మంది సునాక్‌ వైపు మొగ్గు చూపుతున్నా, పార్టీ సభ్యులు మాత్రం లిజ్‌ ట్రస్‌ను కోరుకుంటున్నారు. దీంతో రిషి ఆశలు క్రమంగా సన్నగిల్లాయి.

 

 

బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా సంక్షోభానికి ఆయనే కారణమని కన్జర్వేటివ్‌ సభ్యులు ఇప్పటికే విమర్శిస్తున్నారు. బోరిస్‌ వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ రిషి ప్రధాని కాకూడదనే పట్టుదలతో ఉన్నారు. అయినా సునాక్‌ ప్రయత్నాలను మానుకోకుండా అందరి ఆమోదం పొందేందకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఓటింగ్‌ ప్రక్రియ ఆలస్యమయ్యే కొద్దీ ఆయనకు మద్దతు ఇస్తున్నవారి సంఖ్య పెరుగుతోందని తాజా సర్వే చెబుతోంది. అందులో రిషి 43% మంది, లిజ్‌ ట్రస్‌కు 48% మంది మద్దతు ఇస్తున్నారు. మిగతా 9% మంది మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేదు. వీరితోపాటు ఇతర సభ్యుల మద్దతు చూరగొనేందుకు రిషి సునాక్‌ దేశమంతా తిరుగున్నారు. ఈ ప్రయత్నాలు సఫలం అయితే.. భారతీయ మూలాలు ఉన్న తొలి బ్రిటన్‌ ప్రధాని ఆయనే అవుతారు.

 

Tags: Growing support for Rishi Sunak

Leave A Reply

Your email address will not be published.