బంగారం ధరల్లో పెరుగుదల మార్కెట్ల బేజారు

Growth in gold prices is marketable

Growth in gold prices is marketable

Date:23/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
మంగళవారం కూడా దేశీయమార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో కొనసాగడం మార్కెట్లు భారీ నష్టాలను చవిచూడక తప్పలేదు. మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు, ఆసియా మార్కెట్ల పతనం కూడా దేశీయ మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. వరుసగా రెండో రోజు నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో మిడ్ సెషన్లో అమ్మకాలు పెరిగాయి. ఓ దశలో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల వరకు పతనమైంది. నిఫ్టీ సైతం 123 పాయింట్లు కోల్పోయింది.  అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ ముగింపు ముందున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ట్రేడింగ్లో రియల్టీ షేర్లు స్వల్పంగా పుంజుకోగా.. మిగిలిన అన్ని రంగాలూ ఢీలాపడ్డాయి. ముఖ్యంగా ఫార్మా, ఐటీ, పీఎస్యూ బ్యాంక్స్, మెటల్, ఆటో రంగాలు అధికంగా నష్టాలను చవిచూశాయి. ప్రపంచ మార్కెట్ల నేలచూపు, దేశీయంగా ఇన్వెస్టర్ల ఆందోళనల నేపథ్యంలో వరుసగా రెండో రోజు అమ్మకాలదే పైచేయిగా నిలిచింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 287.15 పాయింట్ల నష్టంతో 33847.23, నిఫ్టీ 98.45 పాయింట్ల నష్టంతో 10146.8 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 73.57 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరల్లో పెరుగుదల నమోదైంది.
ఎన్ఎస్ఈలో.. హెచ్పీసీఎల్ (3.47), ఇండియాబుల్స్ హౌసింగ్ (3.01), హెచ్డీఎఫ్సీ (1.72), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.64), బజాజ్ ఆటో(1.16) షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఆసియా పెయింట్స్ (-5.16), సన్ ఫార్మా (-5.12), విప్రో (-4.07), గ్రాసిమ్ (-3.66), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.45) టాప్ లూజర్లుగా మిగిలాయి.
Tags: Growth in gold prices is marketable

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *