7.3 శాతానికి అభివృద్ధి రేటు

Date:17/07/2018
ముంబై ముచ్చట్లు:
అంతర్జాతీయ ద్రవ్య నిధి  సంస్థ భారత వృద్ది రేటు అంచనాల్లో కోత పెట్టింది. అధిక చమురు ధరలు, వడ్డీ రేట్ల పెంపు తదితర అంశాల నేపథ్యంలో భారత వృద్ధి అంచనాలను స్వల్పంగా కుదించింది. ఈ ఏడాది వృద్ధి రేటు 7.3 శాతానికి, వచ్చే ఏడాది 7.5 శాతానికి పరిమితం కావచ్చని తాజా అంతర్జాతీయ ఆర్థిక అంచనాల (డబ్ల్యూఈవో) నివేదికలో పేర్కొంది. ఏప్రిల్లో అంచనాల కంటే ఇవి వరుసగా 0.1 శాతం, 0.3 శాతం తక్కువ. ”నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) అమలుకు సంబంధించి ప్రతికూల ప్రభావాలు క్రమంగా తొలగిపోతున్న నేపథ్యంలో 2017లో 6.7 శాతంగా ఉన్న భారత్ వృద్ధి రేటు 2018లో 7.3 శాతానికి, 2019లో 7.9 శాతానికి పెరగవచ్చని అంచనా. ఇవి గత ఏప్రిల్లోని అంచనాలతో పోలిస్తే 0.1 శాతం, 0.3 శాతం తక్కువ. అధిక చమురు ధరలు, ద్రవ్యోల్బణం వంటి భయాలతో రిజర్వ్ బ్యాంక్ ఊహించిన దానికన్నా వేగంగా పరపతి విధానాన్ని కఠినతరం చేస్తుండటం తదితర అంశాలు.. భారత్ వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావాలు చూపనున్నాయి” అని ఐఎంఎఫ్ తెలిపింది. డౌన్గ్రేడ్ చేసినప్పటికీ.. వృద్ధి రేటు విషయంలో చైనాపై కంటే భారత్ ముందంజలో ఉండనున్నట్లు పేర్కొంది. అదే సమయంలో చైనా వృద్ది రేటు ఈ ఏడాది(2018) 6.6 శాతానికి.. వచ్చే ఏడాది 6.4 శాతానికి మందగించవచ్చని ఐఎంఎఫ్ తెలిపింది. 2017లో చైనా వృద్ది రేటు 6.9 శాతంగా నమోదైంది. ఆర్థిక రంగ సంస్థలపై నియంత్రణపరమైన ఆంక్షలు పెరగడంతో పాటు విదేశాల్లో డిమాండ్ తగ్గుతుండటం మొదలైన అంశాలు ఇందుకు కారణమని పేర్కొంది. ప్రపంచ దేశాల వృద్ధి ఏప్రిల్లో అంచనా వేసినట్లుగానే యధాతథంగా 3.9 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ తెలిపింది.
7.3 శాతానికి అభివృద్ధి రేటు https://www.telugumuchatlu.com/growth-rate-for-7-3-percent/
Tags:Growth rate for 7.3 percent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *