Gruda not boiled - no tomato found

గ్రుడు ఉడకలేదు – టమోటా దొరకలేదు

– సింగిరిగుంట పాఠశాల పత్తాలేని మెను

Date:21/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

సింగిరిగుంట పాఠశాలలో గ్రుడ్డు ఉడకలేదు. టమోటాలు దొరకలేదు. దీని కారణంగా విద్యార్థులు , టీచర్లు, వంట మనుషుల దయాదాక్షిణ్యాలతో పెట్టిన అన్నం తినాల్సిన దుస్థితి నెలకొంది. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అన్న చందంగా సింగిరిగుంట పాఠశాలలో ప్రభుత్వాదేశాలు అమలుకాలేదు. మంగళవారం నుంచి నూతన మెను మధ్యాహ్న భోజన పథకంలో ప్రారంభించాలని మంగళవారం నాడు పులిహ్గర, ఉడికినగ్రుడ్డు, టమోటా పప్పు వడ్డీంచాల్సి ఉంది. కానీ విద్యార్థులకు చింతపండు చెట్నీ , పులిహ్గర మాత్రం పెట్టారు. ఇదేమిటని హెచ్‌ఎం సోమశేఖర్‌ను విచారించగా సెలవులకు ముందు కోడిగ్రుడ్లు పంపిణీ చేశామన్నారు. వంటమనిషిని టమోటాపప్పు ఎందుకు చేయలేదని అడుగుగా టమోటాలు దొరకలేదని సమాధానం ఇచ్చారు. కాగా ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని పంపిణీ చేయాలని ఆదేశించినా సింగిరిగుంట ఎలిమెంటరీ పాఠశాలలో అమలు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ విషయమై ఎంఈవో కేశవరెడ్డిని ఫోన్‌లో విచారించగా మెను ఖచ్చితంగా పాటించాలని , మెను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tags: Gruda not boiled – no tomato found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *