ఏసీబీకి దొరికిన గుడ్లవల్లేరు వీఆర్వో
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామ సచివాలయం-2 పై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. పట్టాదారు పాస్ బుక్ జారీకి గ్రామ విఆర్వో వసుంధర 5 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. మండలంలోని వేమిగుంట గ్రామంలో ఉన్న రెండున్నర ఎకరాల భూమికు పట్టాదారు పాసుపుస్తకం జారీకి వీఆర్వో 5 వేలు లంచం డిమాండ్ చేసిందని ఆరోపణ. భూమి సూపర్వైజర్ సురేష్ ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శరత్ బాబు ఆధ్వర్యంలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకున్న వసుంధరను ఆరెస్టు చేసి సంబంధిత కోర్టులో హజరు పరిస్తమాని వారు వెల్లడించారు.
Tags: Gudlavalleru VRVO found by ACB