గుంటూరులో గొంతొండుతోంది

Date:15/05/2019
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లా, నరసరావుపేట, పట్టణ శివర్లు ప్రాంతం లో గొంతు తాడుపుకునేందుకు గుక్కెడు నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నానాటికి పెరిగి పోతున్న  జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో మునిసిపాలిటి పని తీరు ఆశాజనకంగా లేవని విమర్శలు వినిపిస్తున్నాయి.నరసరావుపేట ఏర్పడి 200 సంవత్సరాలు పురస్కరించుకుని 1997 అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమి పధకానికి ద్విశతాబ్ది ఉత్సవాలు అనుసందానం చేసి 2వ మంచి నీటి పథకాన్ని ప్రారంభించి పూర్తీ చేసింది, ఐతే మునిసిపాలిటీ పరిధిలోనే పైపు లైన్లు ఉండటం తరవాత కాలంలో పరిధి దాటి జనవాసాలు పెరగటంతో  ఆయా ప్రాంతాల ప్రజలు తాగునీటి సమస్యలు ఎదురుకొనక తప్పడం లేదు శత వసంతాలు పూర్తీ చేసుకున్న నరసరావుపేట మునిసిపాలిటీ ప్రజలకు నీరు అందించేందుకు రెండు మంచినీటి పథకాలు ఉన్నప్పటికీ శివారు ప్రాంతాలలో నివసించే బడుగు బలహీన వర్గాల వారు తాగు నీటి కోసం అల్లాడుతున్నారు.
నరసరావుపేటకు నీటి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.  మున్సిపాల్టీకి సమీపంలోని శాంతి నగర్ వద్ద ఓ మంచి నీటి చెరువూ, మండల కేంద్రం ఐన నకరికలు వద్ద మరో మంచి నీటి చెరువులు ఉన్నాయి. 1915 లో ఏర్పడిన నరసరావుపేట పురపాలక సంఘం 2016 లో శాసన సభాపతి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు ఆధ్వర్యంలో 100 సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐతే , నరసరావుపేట మునిసిపాలిటీ పరిధి దాటి ఎన్నో కాలనీలు ఏర్పడ్డాయి, ఆయా ప్రాంతాల్లో ని ప్రజలు ట్యకర్ల పై ఆధారపడక తప్పడంలేదు, ట్యకర్లు రెండు రోజులకు ఒక సారి మంచినీటిని అందిస్తాయి. ఏ ఒక్క రోజైన అలెస్యంగా ట్యాంకర్లు వచ్చిన చిన్నపిల్లలతో సహా వృద్దులు ఆడవాళ్లు ఎంతో ఇబ్బందికి గురి అవుతున్నారు.
కూలి పని చేసుకుని బ్రతికే మాకు మంచి నీటిని కొనుక్కునే  స్తోమత వారి దగ్గర లేకపోవడంతో మంచి నీటి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన జరిగిన జరిగిన నేపథ్యంలో మునిసిపాలిటీ పరిధిని పెంచి శివారు కాలని లను గుర్తించి నరసరావుపేట మునిసిపాలిటీ లో కలిపి తమ కాలనీలు మంచి నీరు అందేలా చేయాలనీ అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.అధికారులు ఎండాకాలం దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 12 మిలియన్ల నీటిని సప్లై చేస్తున్నామని, నకరికలు మరియు శాంతి నగర్ చెరువులలో గాని మొత్తం 3900 మిలియన్ల లిటర్లు వాటర్ స్టోరేజ్ ఉందన్నారు.ఐతే పట్టణ ప్రజలకి కూడా మంచి నీరు సరిగా అందటం లేదని తెల్లవారుజామునే లేచి మంచి నీటి కోసం ఎదురు చేస్తుంటే అవసరాలకు సరిపడా మంచి నీరు అందటం లేదని తమకు రెండు పూటలా మంచి నీరు అందేలా చేయమని ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు.
Tags: Gulliver is gaining ground

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *