ప్రమాదాన్ని పొంచి ఉన్న గుండి బ్రిడ్జి
రామడుగు ముచ్చట్లు:
రామడుగు మండలం గుండి గ్రామ చెరువు మత్తడి వద్ద ఉన్నటువంటి కరీంనగర్ నుండి గోపాలరావుపేట వెళ్లే ప్రధాన రహదారిలో గల బ్రిడ్జి గత 20 సంవత్సరాలు నుండి శిథిలావస్థలో ఉంది ఈమధ్య కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరిందని స్థానిక సర్పంచి గుండి మానస ప్రవీణ్ పాలకవర్గం ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. ఆదివారం రోజున రాత్రి సమయంలో గ్రామ ఉపసర్పంచ్ వి డి సి చైర్మన్ యువకులు గ్రామస్తులు అందరూ గ్రానైట్ బండతో వెళ్తున్న భారీ వాహనాలను అడ్డుకోవడం జరిగిందన్నారు. భారీ వాహనాలు వెళ్లడం వలన బ్రిడ్జి పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉన్నందున భారీ వాహనాలను ఆపడం జరిగిందన్నారు. బ్రిడ్జి పైన పలుమార్లు గ్రామపంచాయతీ పాలకవర్గం మరమ్మతులు చేసినప్పటికీ భారీ వాహనాలు వెళ్ళటం వలన గుంతలు ఏర్పడి చిన్న చిన్న వాహనాలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. భారీ వాహనాలను ఆపడం తో ఎస్ఐ ఫోన్ చేసి వదిలి పెట్టాలని చెప్పగా వదిలేస్తామని చెప్పడం జరిగిందని పాలకవర్గం తెలిపారు.
అంతలోనే రామడుగు పోలీస్ అధికారి ఏఎస్ఐ అనంతరెడ్డి వచ్చి వాహనాలను అడ్డుకున్న గ్రామ వీడిసి చైర్మన్ ఉప సర్పంచ్ యువకులతో వాహనాలు ఎందుకు ఆపారు మీకు ఏం అవసరమని బ్రిడ్జి కూలితే కూలనివ్వండి ప్రమాదం జరిగితే జరగనివ్వండి అంటూ కూలితే మీరు కట్టిస్తారా అంటూ మా వీడియో తీస్తూ బెదిరిస్తూ కేసు పెడతానని బెదిరించి దగ్గరుండి వాహనాలను పంపించారని పాలకవర్గం తెలిపారు. మరి బ్రిడ్జి కూలిన లేక ప్రమాదం జరిగిన ఎవరు బాధ్యత వహిస్తారు పోలీస్ అధికారుల సంబంధిత అధికారుల లేక క్వారీ ఓనర్ల ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని గుండి గ్రామ ప్రజలు కోరుతున్నారు.కార్యక్రమంలో సర్పంచ్ గుండి మానస, ఉప సర్పంచ్ మేడి శ్రీనివాస్ వీడిసి చైర్మన్ గుండి ప్రవీణ్, యువకులు ఇల్యాస్, అజయ్ ప్రశాంత్ సృజన్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Gundi Bridge is a dangerous bridge