మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి గుండ్లపల్లె సమస్యలు

Gundulapally issues to the attention of Minister Peddi Reddy

Gundulapally issues to the attention of Minister Peddi Reddy

– సత్వర పరిష్కారానికి మంత్రి హామీ

– ప్రజాభిమానాన్ని చూరగొంటున్న సునీల్ కుమార్ రెడ్డి

Date:07/12/2019

పెద్ద పంజాణి ముచ్చట్లు:

మండలంలోని కొళతూరు పంచాయతీ గుండ్లపల్లెలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని శనివారం ‘ఆదర్శ గ్రామం… మన గుండ్లపల్లె’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలం యర్రాతివారిపల్లిలో శ్రీ అయ్యప్పస్వామి సన్నిధిలో మాలాదరణచేశారు. ఈ సందర్భంగా పెద్ద పంజాణి మండలం గుండ్లపల్లె గ్రామానికి చెందిన సునీల్ కుమార్ రెడ్డి గ్రామంలో నెలకొన్న రోడ్డు దుస్థితి, అర్హులకు పక్కా ఇళ్లు, మురికినీటి కాలువలు, రవాణా సౌకర్యం  తదితర మౌలిక వసతులు కల్పించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందిస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే సునీల్ కుమార్ రెడ్డి పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాలనే ఆలోచన అభినందనీయన్నారు. ప్రతిఒక్కరూ ఇలాగే స్వగ్రామ అభివృద్ధికి పాటు పడలన్నారు. గుండ్లపల్లె సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సునీల్ కుమార్ రెడ్డి తో పాటు గుండ్లపల్లె గ్రామస్థులు బాబు, లక్ష్మయ్య, గార్గేయ తదితరులు పాల్గొన్నారు.

 

ఆస్తి కోసం హత్యలు

 

Tags:Gundulapally issues to the attention of Minister Peddi Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *