గ్రామంలో తూపాకి కాల్పులు యువకుడు ఆరెస్టు

చిత్తూరు  ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కడప నత్తం గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. చాన్ బాష(24) నాటు తుపాకితో తాను ప్రేమించిన బాలిక ఇంటి వద్ద కాల్పులు జరిపాడు. గ్రామంలోని బుకారి అని వ్యక్తి కూతురైనా మైనర్ బాలికను తన ఫోన్ నెంబర్ ఇవ్వాలని ఛాన్ బాష  తరచుగా వేధిస్తున్నడు. దాంతో విషయాన్ని బాలిక తల్లిదండ్రుల కు  తెలియజేసింది. వారు  గ్రామసులతో కలసి ఛాన్ బాషా ను మందలించారు.  ఆగ్రహించిన ప్రియుడు రాత్రి బుకారి ఇంటి వద్ద నాటుతుపాకీ తో కాల్పులకు పాల్పడ్డాడు.  ఈ ఘటనలో బుకారి కుటుంబం తృటితో తపించుకుంది. అడ్డువచ్చిన పక్క ఇంటి వారిపై కూడా  ఛాన్ భాష కాల్పులు జరపడంతో తూటాలు ఆ ఇంటి ముఖ ద్వారం లోకి దూసు కెళ్లాయి. విషయం తెలుసుకున్న పోలీసులు తుపాకితో పాటూ ఛాన్ భాషను అదుపులోకి తీసుకున్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Gunfire in the village
The young man was arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *