గుంజపడుగు ను కాశీ పట్నం మండలంగా ప్రకటించాలి
-4వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
మంథని ముచ్చట్లు:
పెద్దపల్లి జిల్లా మంథని మండలం లోని గుంజపడుగు గ్రామాన్ని కాశిపట్నం మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. గుంజపడు బస్ స్టాండ్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పలు గ్రామాల ప్రజలు మద్దతు తెలియ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈరోజు తో 4వ రోజు రిలే నిరాహార దిక్ష చేపట్టడం జరిగిందని, గుంజపడుగు ను మండలం చేస్తే చుట్టూ పక్కల గ్రామాల వారికి అనువుగా ఉంటుందని, పరిపాలన మరింత సులభంగా ఉంటుందని, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని అన్నారు. మంగళవారం రిలే నిరాహార దీక్షలో వార్డ్ సభ్యుడు దండవేనా బాణేష్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు దొడ్డిపట్ల శ్రీనివాస్, బండి మల్లేష్, కాసిపేట అనిల్, మాటేటి సమ్మయ్య, విరావేన కిష్టయ్య, అరెల్లి కృష్ణ, సాదుల వెంకటి దీక్ష చేపట్టాగా వీరికి మద్దతుగా సర్పంచ్ కుంట రాజు, మాజీ వైస్ ఎంపీపీ ఊదరి శంకర్, ఎంపీటీసీ ఊదరి లక్ష్మి లచ్చయ్య,మాజీ సర్పంచ్ ఊదరి ఓదెలు, మాజీ సర్పంచ్ కండె రమేష్,మజీ వార్డ్ మెంబెర్ ఊదరి శంకర్, వార్డ్ మెంబెర్ కాయితి శ్యామ్, జేఏసీ నాయకులు రేగళ్ల రామ్మన్న, ఆకుల సుగుణకర్,పోగుల బాపు, బుర్ర శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Tags: Gunjapadugu should be declared as Kashi Patnam mandal