పోలీసుల తనిఖీల్లో నాటు తుపాకులు స్వాధీనం
నంద్యాల ముచ్చట్లు:
ఆళ్లగడ్డ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు కార్దన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఐదు పార్టీలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 16 నాటు తుపాకులు,3 నాటు తుపాకులను ఉపయోగించే బ్యారెళ్ళు స్వాధీనంచేసుకున్నారు. 18 మందిని అరెస్ట్ చేసారు.
మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు.ఆళ్లగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వెంకటరామయ్య, రూరల్ సీఐ హనుమంతనాయక్, రూరల్ ఎస్సై టి.నరసింహులు, సిబ్బంది పాల్గోన్నారు. అహోబిలం గ్రామంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించి గ్రామం చుట్టుముట్టి ఐదు పార్టీలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారుర. 18 మంది వ్యక్తులను ఆదుపులో తీసుకొని వారి నుండి 16 నాటు తుపాకులు, మూడు నాటు తుపాకులను ఉపయోగించే బ్యారెళ్ళను మొత్తం 19 స్వాధీనం చేసుకున్నారు.
Tags: Guns were seized during police inspections

