కలియుగ వైతాళికుడు గురజాడ

డోన్ ముచ్చట్లు:

గురజాడ కలియుగ వైతాళికుడు అని జడ్పీ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటసుబ్బారెడ్డి అన్నారు, స్థానిక డోన్ పట్టణం పాతపేటలో  గురువారం ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా, గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు రాధ, దేవేంద్రప్ప మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం లో సంస్కృతం నందు ఉన్న సాహిత్యంను వ్యవహారిక భాషలో లోకి మార్చి అందరికీ అర్థమయ్యే రీతిలో, అచ్చ తెలుగులోకి అనువదించారు, అంతే కాకుండా ఆరోజుల్లో మూఢాచారాలను పారద్రోలి, జ్ఞానోదయం కలిగించే కార్యక్రమాలు చేపట్టారు, స్త్రీ లను తొక్కిపెట్టేనాటి శిథిల సమాజం పై కన్యాశుల్కం నాటకంతో అగ్ని వర్షం కురిపించిన కాలం యోధులు గురజాడ, గురజాడ అప్పారావు గారు రచించిన దేశభక్తి గేయం దేశంను ప్రేమించుమన్నా, మంచి యన్నది పెంచుమన్నా ప్రసిద్ధి చెందింది.పుత్తడి బొమ్మా పూర్ణమ్మ నాటికతో జనంలో చైతన్యం కలిగించారన్నారు,ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి,రవిశేఖర్, వెంకట రమణ, వెంకట లక్ష్మీ, రఘునాథ్, ఎస్తేరమ్మ, లక్ష్మీకాంతరెడ్డి,భూకాంత రెడ్డి, సుబ్బారాయుడు, మధుసూదన్ రెడ్డి, విజయకుమార్, సుభాన్, శ్రీనివాసులు, బాబు, లీలావతమ్మ, ఆదినారాయణ, భాను ప్రకాష్ రెడ్డి, సురేష్, రమేష్, ముని రాజు, మహేష్, అల్లిపీరా, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Gurjada, Vaithalika of Kaliyuga

Post Midle
Post Midle