నరసాపురం తీరంలో ఈదురు గాలులు

నరసాపురం ముచ్చట్లు:


తుఫాన్ ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నా యి. దీంతో కొన్ని గ్రామాలలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. సముద్ర వేటను నిషేధించడంతో వేటకు వెళ్ళిన బొట్లన్నీ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది తీరానికి చేరుకుంటున్నాయి. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో సందర్శకుల రాకను నిలిపివేశారు. నర్సాపురం సబ్ కలెక్టర్ తాసిల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు కోసిన ధాన్యాన్ని రైతులు ఒబిడి చేసుకుంటున్నారు.

 

Tags: Gusty winds at Narasapuram coast

Post Midle
Post Midle