ఆటవీ అధికారులపై గుత్తికోయల దాడి
మహబూబాబాద్ ముచ్చట్లు:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ములుగు సరిహద్దు ప్రాంతంలోని జగ్గన్నగూడెం వద్ద గొత్తి కోయలను ఖాళీ చేసేందుకు ఫారెస్ట్ సిబ్బంది వెళ్లారు. అయితే గుత్తి కోయలు ఖాళీ చేయడానికి నిరాకరించారు. తరువాత ఆగ్రహంతో ఫారెస్ట్ అధికారులపై కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నం చేసారు. వెనక్కి తగ్గిన ఫారెస్ట్ అధికారులు అక్కడినుంచి వెళ్లిపోచారు. కనీసం పోలీస్ ఫోర్స్ లేకుండా సిబ్బందిని పంపడం పట్ల ఎఫ్ ఆర్ వో పై ఉద్యోగస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫారెస్ట్ ఉద్యోగులందరూ సమావేశం కానున్నట్లు సమాచారం

Tags;Guthikoyas attacked the officials
