తిరుపతిలో గుట్కా స్వాధీనం

తిరుపతి    ముచ్చట్లు:
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో  గుట్కా ప్యాకెట్లు అక్రమం విక్రయాల గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్దనుండి 9 లక్షల రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్లు 78 అక్రమ మద్యం  సీసాలు ,ఓ ఆటో , స్కూటర్,స్వాదీనం  చేసుకున్నట్లు సిఐ శివప్రసాద్ రెడ్డితెలిపారు.  . తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ముందుగా పోలీసులు స్వాధీనం చేసుకున్న, గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని, ముద్దాయి తోపాటు మీడియాకు చూపించారు. అనంతరం సీఐ శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ విక్రయాల తనిఖీల్లో భాగంగా  ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దకాపు లేఅవుట్ లో ఓ ఇంటిలో తనిఖీలు నిర్వహించి కేశువులు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అతని వద్దనుండి, 9 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను,78 కర్ణాటక మద్యం సీసాలను,ఆటో,ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని  అన్నారు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని పేర్కొన్నారు..

 

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Gutka captured in Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *