దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్

సంచలన, సాహసోపేతమైన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్
ప్రతి మండలంలో లక్ష మొక్కలను నాటడమే లక్ష్యం
ప్రత్యేక దృష్టితో గ్రామాలాభివృద్ధి
అవసరమైన అన్ని రోడ్లను పూర్తి చేస్తాం
డ్రైనేజి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్  ముచ్చట్లు:
దేశ రాజకీయాల్లో దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు.,  పీఎంజీఎస్వై, జీవవైవిధ్య కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు చిట్యాల మండలంలోని నేరడ-ఎలికట్టె గ్రామ సరిహద్దుల్లో రోడ్డుకు ఇరువైపులా ఆయన మొక్కలు నాటారు. తొలుత నేరడ గ్రామంలోని ఎస్సి కాలనీ మహిళలతో మాట్లాడారు.  ఎస్సి కాలనీలో పేరుకుపోయిన అన్ని సమస్యలను త్వరత్వరగతిన పూర్తి చేస్తామని తెలిపారు.  కాలనీలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజి వ్యవస్థకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు, ఏ ముఖ్యమంత్రులు చేయని  సాహసోపేతమైన నిర్ణయాలతో ముఖ్యమంత్రి కేసీఆర్  అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రతి మండలంలో లక్ష మొక్కలను నాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రత్యేక దృష్టితో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు, గ్రామాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను దశలవారిగా సమకూర్చుతామని అన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tgas:Guts leader CM KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *