యాదగిరీషుడిని దర్శించుకున్న గుత్తా

Date:13/03/2018
యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి  మంగళవారం నాడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా  వచ్చిన గుత్తా  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. అయనకు తెరాస శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆలయప్రాంగణంలో గుత్తా సుఖేందర్ రెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు.   స్వామి వారికి ప్రత్యేక పూజలు  జరిపిన  సుఖేందర్ రెడ్డి దంపతులకు స్వామివారి ఆశీసుళ్ళు, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. తరువాత గుత్తా మీడియాతో మాట్లాడారు.   రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసి  రైతు  సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ  ముఖ్యమంత్రి ఒక లక్షా అరవైఒక వేయ్యి  మంది  సభ్యులతో సమన్వయ సమితి ఏర్పాటు జరిగిందన్నారు. రైతు పంట  మొదలుపెట్టి నుంచి చేతికొచ్చి అమ్ముకునే వరకు మార్కెటింగ్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు,  వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అందరూ రైతుకు సహాయ సహకారాలు అందజేస్తారని అయన అన్నారు.  అదే విధంగా అధికారుల సహకారంతో  తెలంగాణ లో ఉన్న 71 లక్షల మంది రైతాంగానికి ఎకరాకు 8వేల రూపాయల చొప్పున  ఇవ్వడానికి ఈ బడ్జెట్లో 2వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని అయన అన్నారు.   వీటితో పాటు  వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో ప్రతి మండలానికి 10 చొప్పున హార్వెస్టర్ లు ఇవ్వడం పెద్ద ఎత్తున జరుగుతుందని వెల్లడిచారు. రాష్ట్రంలో 2656 రైతుక్లస్టర్ లు ఏర్పాటు చేసి తద్వారా ప్రతి క్లస్టర్ కి ఒక అధికారి ని నియమించడం జరుగుతున్నదని, రైతు సమన్వయ అధికారులు రైతులతో పరస్పర సహకారంతో పని చేయాలని గుత్తా తెలిపారు. అదేవిధంగా తాను 1992నుండి 98 వరకు నల్గొండ,రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల చైర్మన్ గా పనిచేశానని, తరువాత  తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పాడి పరిశ్రమలో పనిచేశానని అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి  వరకు ఉన్న అనుభవంతో నాపై వున్న నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు  రాష్ట్ర రైతు సమన్వయం సమితి అధ్యక్షునిగా ఈ బాధ్యతలు అప్పజెప్పారని అన్నారు.
Tags: Gutta who visited the Yadavari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *