వరంగల్ లో వడగండ్ల వాన
వరంగల్ ముచ్చట్లు:
వడగండ్ల వాన వరంగల్ ను వణికించింది. రైతులకు కడగండ్లు మిగిల్చింది. వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లోని వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చితో పాటు ఉద్యాన పంటలు సర్వనాశనమయ్యాయి. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లోని మిర్చి పంట రాలిపోయింది. పరకాల డివిజన్లోని పరకాల, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు మండలాల్లో వరి, మొక్కజొన్న పంట బలమైన ఈదురుగాలులతో నేలకొరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో చెట్లు కూలి రోడ్లపై పడిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో చాలా గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నర్సంపేట మండలంలోని దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట మండలాలో పలువురి ఇళ్లు, షెడ్లు కూలిపోయాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 2,3 ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా నీరు చేరుకోవడంతో పనులకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ఒక్కరోజు పని ఆగిపోవడంతో సింగరేణి సంస్థకు సుమారు రెండు కోట్ల మేరకు నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Hail in Warangal