రేపటి నుంచి ఎస్సై  పరీక్షకు హాల్ టిక్కెట్లు

Hall tickets for the exam from tomorrow

Hall tickets for the exam from tomorrow

 Date:14/08/20183
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలో ఎస్సై రాతపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఆగస్టు 16 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం  తెలిపింది. ఆగస్టు 26న ఎస్సై ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో.. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆగస్టు 16న ఉదయం 8 గంటల నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
అభ్యర్థులు ఆగస్టు 24వ తేదీ అర్ధరాత్రి వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 1,217 ఎస్సై పోస్టులకు 1.88 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆగస్టు 26న ఉదయం 10.00 గం. నుంచి మధ్యాహ్నం 1.00 గం. వరకు రాతపరీక్ష నిర్వహిస్తారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని 10 ప్రధాన పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags:Hall tickets for the exam from tomorrow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *