Handiniwa Water for Pungamma Pond and Summer Storage

పుంగమ్మ చెరువుకు, సమ్మర్‌స్టోరేజ్‌కు హంద్రీనీవా జలాలు

Date:18/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

హంద్రీనీవా కాలువ నీటిని గత వారం సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు విడుదల చేశారు. అలాగే మంగళవారం నీటి వేగం తీవ్రం కావడంతో పుంగమ్మ చెరువుకు కూడ నీటిని వదిలే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. కాగా ఎన్నికల సమయంలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామఛంద్రారెడ్డి హంద్రీనీవా నీటిని నూతన సంవత్సరంలో సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు , చెరువుకు నీటిని విడుదల చేస్తామని పట్టణ ప్రజలకు హామి ఇచ్చి నిలబెట్టుకున్నారు. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు 30 హెచ్‌పీ రెండు మోటార్లను సంపుకు అమర్చి హంద్రీనీవా నీటిని సంపు ద్వారా సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకుకు తరలించే కార్యక్రమం చేట్టారు. దీంతో పాటు చెరువుకు కూడ నీరు వదలడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో పట్టణంలో మంచినీటి సమస్య తీరిపోతుందని ఆశబావం వ్యక్తం చేస్తున్నారు.

తిరుచ్చిపై సోమస్కందమూర్తి

Tags: Handiniwa Water for Pungamma Pond and Summer Storage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *