పుంగనూరులో వైభవంగా హనుమత్ జయంతి
పుంగనూరు ముచ్చట్లు:
హనుమత్ జయంతి వేడుకలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని రామాలయాలల్లోను, హనుమాన్ ఆలయాలలోను స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. మండలంలోని అరవపల్లె వద్ద గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం, హనుమంతరాయునిదిన్నెలోని శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం, సుబ్బమ్మ చెరువు వద్ద గల శ్రీవీరాంజనేయస్వామి ఆలయం, పట్టణంలోని కోనేటి వద్ద గల ఆభయాంజనేయస్వామి ఆలయంలోను పూజలు నిర్వహించారు. రామనామస్మరణలతో ఆలయాలు భక్తిపారవశ్యమైంది. ఈ సందర్భంగా భక్తులకు పెసరపప్పు, పానకం, మజ్జిగ పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Tags; Hanumat Jayanti celebrated in Punganur
