Natyam ad

నటుడు బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు

మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి

హైదరాబాద్ ముచ్చట్లు:


హైదారాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లో ఈరోజు జరుపుకొంటున్న జన్మదిన వేడుకలు సందర్భంగా సినీనటుడు బాలకృష్ణను మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాధ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రిలో  జన్మదిన వేడుకల్లో ఎంతో బిజీగా ఉన్న బాలకృష్ణ ఆప్యాయంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని స్టేజి పైకి ఆహ్వానించి ఆసుపత్రి వైద్య సిబ్బందికి , పిల్లలకు ప్రత్యేకంగా పరిచయం చేసారు. జన్మదిన వేడుకల సందర్భంగా బాలకృష్ణ కు పుష్ప గుచ్ఛం అందించి కేక్ తినిపించిన అనంతరం శాలువతో హిందూపురం ఎమ్మెల్యే ని సన్మానించారు.
పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కోట్లాది మంది తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా భావించే మన అన్ననందమూరి తారకరామారావు గారి ముద్దుబిడ్డ తెలుగు ప్రజల అభిమాన నాయకుడు సినీనటుడు నందమూరి బాలకృష్ణ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ,మెలసి ఆనందంగా మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానని అన్నారు.హిందూపురం ఎమ్మెల్యే సీని నటుడు నందమూరి బాలకృష్ణ లాంటి వ్యక్తి ఇప్పటికే  ప్రజా సేవకుడిగా నటుడిగా ,అభిమాన నాయకుడుగా ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నారు.అతని సేవలు రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమని ,ఇలాంటి మహానాయకుడు ఆయురు ఆరోగ్యాలతో ఉంటూ నిరంతరం ప్రజల్లో సేవకుడిగా ఉండి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించే  విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు నందమూరి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర ప్రజల .

 

 

Post Midle

Tags: Happy Birthday to Actor Balayya

Post Midle