ఘనంగా ప్రారంభమైన మాతృ వందన వారోత్సవాలు

Happy Birthday Weekend Weeks

Happy Birthday Weekend Weeks

Date:02/12/2019

సోమల ముచ్చట్లు:

మండలం లోని కందూరు లో మాతృ వందన వారోత్సవాలు ఘనంగా ప్రారంభించామని ఆరోగ్యవిద్యాధికారి మహమ్మద్ రఫీ అన్నారు. డాక్టర్ నీలిమ ఆధ్వర్యంలో మాతృ వందన వారోత్సవాలు స్థానిక బజారు వీధిలో ని అంగన్వాడీ కేంద్రంలో ప్రారంభించారు.ఈసందర్భంగా ఆరోగ్యవిద్యాధికారి మహమ్మద్ రఫీ మాట్లాడుతూమాతృ వందన వారోత్సవాలు విజయవంతం చేద్దాం 2.12.19 నుండి 8.12.19 వరకు రాష్ట్రంలో మాతృ వందన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.. ఈ మాతృ వందన వారోత్సవాలు ముఖ్య ఉద్దేశ్యం 1.ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం (పి.ఎం.వి.వి.వై)పై సమాజంలో అవగాహన కల్పించుట.2.పి.ఎం.వి.వి.వై అమలులో సవరణలు తగ్గించి,లబ్ధిదారులకు రెండవ,మూడవ దపా లో ఇచ్చే పారితోషకం వారి ఖాతాలో 100శాతం జమ చేయించడం 3.అనుకున్న లక్ష్యాల మేరకు కొత్త గర్భవతులు ను నమోదు చేయించుట 4.లబ్ధిదారులకు తృపికరమైన సేవలు అందిచుట.మాతృ వందన వారోత్సవాలు లో మొదటి రోజు అనగా 2.12.19 న మాతృ వందన వారోత్సవాలు ప్రారంభం.రెండవ రోజు 3.12.19 న అనుబంధ శాఖలతో అవగాహన సమావేశం నిర్వహహించుట.మూడవ రోజు 4.12.19 న నమోదు చేయని గర్భవతులు నమోదు చేయడం నాలుగవ రోజు 5.12.19 న ఆధార్ మరియు బాంక్ ఖాతాల సమస్యలు పరిష్కారం చేయుట.ఐదవ రోజు 6.12.19 న పెండింగ్ ఉన్న 2వ,3వ పారితోషకం నిధులు విడుదల పై శ్రద్ధ వహించుట.ఆరవ రోజు 7.12.19 న గర్భవతులు కు రక్తహీనత, పౌష్టికాహారం, ఆరోగ్యం,వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించుట.ఏడవ రోజు 8.12.19 న మాతృ వందన వారోత్సవాలు లో అత్యంత ప్రతిభ కనపరచిన సిబ్బంది కి పురస్కారం సన్మానం జిల్లా,రాష్ట్ర అధికారులచే చేయబడును.ఏఈ పథకం యొక్క నగదు ఆధార్ బేస్డ్ పేమెంట్ ద్వారా జరుగుతుంది. కావున ప్రతీ లబ్ధిదారు ఆధార్ కార్డ్ కు భర్త యొక్క పేరు మరియు బ్యాంక్ ఖాతా నెంబర్ అనుసంధానం తప్పనిసరిగా చేసుకోవలెను.ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పి.ఎం.వి.వి.వై)నాలుగు దశలలో ఇవ్వబడును.1.తొలిసారి గర్భవతి గా నమోదు చేసుకుని ఎం.సి.పి.కార్డ్ పొందితే మొదటి విడతగా రూ1000/.మరియు 2.మొదటి గర్భస్థ పరీక్ష చేయించుకున్న పుడు రూ 2000/-మూడవసారి ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేసుకుంటే రూ1000/-.నాలుగవ సారి బిడ్డకు సకాలంలో టీకాలు వేయించుకుని,జనన ధ్రువీకరణ పత్రం పొందితే రూ 2000/-వారి ఖాతాలో జమ చేయబడును.ఆరొగ్య కరమైన దేశ నిర్మాణం కోసం సురక్షిత మాతృత్వం. అభివృద్ధి పథంలో దేశం.ఈకార్యక్రమంలో ఆరోగ్యవిద్యాధికారి మహమ్మద్ రఫీ,పర్యవేక్షకులు సునందమ్మ,షఫీ,ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

 

నరసింహ స్వామి పుణ్య క్షేత్రంలో  4 రాజ గోపురాలకు భూమి పూజలు 

 

Tags:Happy Birthday Weekend Weeks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *