Natyam ad

వ్యక్తిత్వ వికాసంతో సంతోషకరమైన జీవితం

– ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు   సత్య నగేష్

 

తిరుమల ముచ్చట్లు:

 

ప్రతి ఒక్కరూ వ్యక్తిత్వ వికాసంతో సంతోషకరమైన జీవితం గడపవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు   సత్య నగేష్ తెలిపారు. తిరుపతి శ్వేత భవనంలో రెండు రోజులపాటు టీటీడీ ఉద్యోగులకు నిర్వహించనున్న వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమం గురువారం ప్రారంభమైంది.ఈ సందర్భంగా  సత్య నగేష్ మాట్లాడుతూ, టీటీడీలో ఉద్యోగ విధులు నిర్వహించే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో, వివిధ సమయాలలో పని ఒత్తిడికి గురి అవుతుంటారని, ఆ ఒత్తిడిని తగ్గించేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీటీడీ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.శ్వేత సంచాలకులు భూమన సుబ్రమణ్యం రెడ్డి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రచారాలు, వంటి వాటిపై కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అర్చకులు, డ్రైవర్ల ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేసి వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాబోవు రోజుల్లో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Happy life with personality development

Post Midle