ఘనంగా పోలీసు అమర వీరుల దినోత్సవం
విజయవాడ ముచ్చట్లు:
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తో హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి “అమరులు వారు” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 11 మంది అమరులైన పోలీస్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం జగన్, రాష్ట్రంలో 6,511 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
Tags: Happy Police Martyrs Day

