ఘనంగా  ప్రపంచ బైబిల్ దినోత్సవం

కడప ముచ్చట్లు:

కడప నగరంలోని చిన్న చౌక్ లో వున్నహోలీ జీసస్ క్రైస్ట్ కెథడ్రల్ చర్చిలో  బిషప్, వరల్డ్ పీస్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ చైర్మన్, క్రీస్తు రత్న అవార్డు గ్రహీత డాక్టర్ కే శామ్యూల్ బాబు ఆధ్వర్యంలో వరల్డ్ బైబిల్ డే ను ఘనంగా నిర్వహించారు ముందు గా గూటన్ బర్గ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈసందర్భంగా బిషప్ డాక్టర్ కే శామ్యూల్ బాబు మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని చెప్పారు భారత దేశం లోఒక క్రైస్తవ మిషనరీ సంస్థ ను జోహనస్ జాన్ గూటన్ బర్గ్ స్థాపించి ముద్రణా యంత్రాన్ని (అచ్చు యంత్రం) కనిపెట్టి మొట్టమొదట బైబిల్ ను అచ్చు వేసిన ఒక గొప్ప రోజుని ఆయన కొనియాడారు ప్రపంచ మానవాళికి వైజ్ఞానిక తలుపులు తెరిచిన మహనీయుడు జాన్ గూటన్ బర్గ్ కోరిక తో ప్రింటింగ్ మిషన్ కనుగొన్నారని శామ్యూల్ బాబు అన్నారు గూటన్ బర్గ్ జర్మనీ లోని మెయింజ్ పట్టణంలో క్రీ,శ 1400 జన్మించారని, క్రీ,శ 1458 ఆగస్టు 24 న ముద్రణా యంత్రాన్ని కనిపెట్టి మొదట బైబిలు గ్రంథాన్ని లాటిన్ భాషలో 300 కాపీలు ముద్రించడం జరిగిందన్నారు అచ్చు యంత్రాన్ని మొదట భారత దేశానికి పరిచయం చేసింది ఆయనే అన్నారు గూటన్ బర్గ్ భారత దేశానికి చేసిన సేవలను మరువలేమన్నారు ఈ కార్యక్రమంలో రెవ డా బిషప్ కె దానం,వజ్రమ్మ,రెవ స్వర్జన్ రత్న కుమార్, కె యస్ రాజకుమారి,ప్రణూష, కె హెప్సిబా ,కె రిచర్డ్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Happy World Bible Day

Leave A Reply

Your email address will not be published.